విజయవాడ స్టేషన్ కు అదిరిపోయే ఫీచర్- దేశంలోనే తొలిసారి-రైల్వేమంత్రి ట్వీట్
దేశంలోని అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఈ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామా్ లపై సౌరశక్తితో కూడిన కాంతిపీడన కవర్ ను ఏర్పాటు చేశారు. దీంతో రైల్వే స్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను ఈ సౌరశక్తి ప్యానెళ్ల ద్వారానే పొందే అవకాశం లభించింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ట్వీట్ చేశారు.
విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ లపై ఏర్పాటు చేసిన సౌరశక్తి కవర్ ద్వారా ఏడాదికి 8 లక్షల రూపాయలకు పైగా కరెంటు బిల్లు ఆదా కానుంది. అంతే కాకుండా స్టేషన్లోని 18 శాతం విద్యుత్ అవసరాలు తీరబోతున్నాయి. అదే సమయంలో కార్బన్ ఉద్గారాల ఉత్పత్తి కూడా తగ్గడం ద్వారా పర్యావరణ సహిత స్టేషన్ గా మారబోతోంది. ఈ కవర్ కింద ఉండే ప్రయాణికులకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేద తీరేందుకు వీలు కలగబోతోంది. ఈ విషయాల్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్వీట్ లో వివరించారు.

విజయవాడ స్టేషన్ దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్లలో ఒకటైనా సదుపాయాల విషయంలో మాత్రం రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉండేవి. కానీ కొన్నేళ్లుగా రైల్వేశాఖ ఈ స్టేషన్ పై ప్రత్యేక దృష్టిసారించి సౌకర్యాలను అభివృద్ది చేస్తోంది. అదే సమయంలో ప్రైవేటీకరణ కోసం వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్లాట్ ఫామ్స్ పై సోలార్ కవర్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ జరిగినా, జరగకపోయినా స్టేషన్ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, పర్యావరణ సహితంగా మార్చేందుకు ఈ సోలార్ కవర్ ఉపయోగపడబోతోంది.
Vijayawada Station becomes the first in India to be equipped with an innovative solar photovoltaic cover-over-platform. It will:
— Piyush Goyal (@PiyushGoyal) July 1, 2021
✅ Ensure savings of ₹8.1 lakh p.a.
⚡️ Meet 18% power requirements of the station, reducing carbon emissions
👨👩👧👦 Act as shelter for passengers pic.twitter.com/7GejlBTZqQ
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications