బెజ.. బెజవాడ: పురంధేశ్వరి టు జనసేన (పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రంలో మల్కాజిగిరి సీటు హాట్‌గా మారిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి లోకసభ స్థానంతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం కూడా హాట్ కేక్ అవుతోంది. విజయవాడ నుండి పోటీ చేసేందుకు పలు పార్టీల నుండి పలువురు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు.
బిజెపిలో చేరిన తర్వాత మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ పైన మరింత దృష్టి సారించారంటున్నారు. టిడిపి విజయవాడ లోకసభ అభ్యర్థిగా కేశినేని నాని దాదాపు ఖరారయ్యారు. ఆయనకు చంద్రబాబు నుండి హామీ కూడా లభించింది. అయితే, ఎన్నికల ముందు టిడిపిలో కొత్త పేర్లు తెర పైకి వస్తున్నాయి.
ఎన్నారై కోమటి జయరాం ఆదివారం చంద్రబాబును కలిశారు. ఆయన విజయవాడ లోకసభ టిక్కెట్ అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు కూడా టిడిపిలోకి వస్తారనే ప్రచారం జరిగినా అది కుదరని పని అని అర్థమైపోయింది. అయితే, ఆయన మాత్రం విజయవాడ టిక్కెట్ కోసం టిడిపి తరఫున ప్రయత్నాలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పొట్లూరి వరప్రసాద్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగుదేశం
విజయవాడ లోకసభ టిక్కెట్ కోసం టిడిపి, బిజెపిలలో పోటా పోటీ నెలకొంది. టిడిపి నుండి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది రేసులో ఉన్నారు. కేశినేని నానికి హామీ వచ్చినప్పటికీ ఆయనతో పాటు వల్లభనేని వంశీ, కోమటి జయరాంలు ఉన్నారు.

బిజెపి
భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి బెజవాడ బరిలో దిగాలను చూస్తున్నారట. ఇటీవల ఆమె స్థానిక నేతలతో వరుసగా భేటీ అవుతున్నారంటున్నారు.

జనసేన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పొట్లూరి వరప్రసాద్ విజయవాడ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన ఆ టిక్కెట్ కోసమే పవన్ పక్కన చేరి పార్టీ పెట్టించారనే ఆరోపణలు వచ్చిన వియం తెలిసిందే.

పొత్తు పొడిస్తే...
బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరితే బెజవాడ లోకసభ టిక్కెట్ ఇంకా హాట్‌గా మారే అవకాశముంది. టిడిపి నుండి ముగ్గురు నలుగురు, బిజెపి నుండి పురంధేశ్వరి, జనసేన నుండి పొట్లూరి టిక్కెట్ ఆశిస్తున్నందున... పొత్తు కుదిరితే ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications