డాక్టర్ గా మారిన విజయవాడ ఏసీపీ- పీసీసీ ఛీఫ్ శైలజానాథ్ ప్రాణం కాపాడిన వైనం
పోలీసులో నిత్యం కనిపించే కరకుదనమే అందరికీ గుర్తుంటుంది. కానీ అప్పుడప్పుడూ పోలీసులు కూడా తమలో మానవత్వం ఉందని నిరూపిస్తున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన ఇవాళ విజయవాడలోని కృష్ణలంక పోలీసు స్టేషన్ లో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ అక్రమ కేసులను నిరసిస్తూ నిరసన చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆందోళన చేపట్టారు. ఈ నేుథ్యంలో ఆయన్ను పోలీసులు కృష్ణ లంక పోలీస్టేషన్ కు తరలించారు.

అసలే ఎండ ఎక్కువగా ఉండటం, పోలీసు జీపులో స్టేషన్ కు రావడంతో ఆయకు రక్తపోటు పెరిగింది. దీంతో శైలజనాథ్ కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు కూడా ఆందోళనకు లోనయ్యారు.పీసీసీ అధ్యక్షుడు కావడం, ఆయనకు పీఎస్ లో ఏదైనా జరిగితే తమ పని అయిపోతుందని అనుకున్నారు.
ఈలోపు ఏసీపీ రవికిరణ్ కృష్ణలంక పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన ఏసీపీ రవికిరణ్ వెంటనే రంగంలోకి దిగారు. శైలజానాథ్ ఆరోగ్య పరిస్ధిని పరీక్షించారు. కాసేపు డాక్టర్ గా మారి శైలజానాథ్ కు సేవలు అందించారు. దీంతో శైలజానాథ్ కాసేపటి తర్వాత కోలుకున్నారు. అనంతరం ఆయన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే సకాలంలో ఏసీపీ స్టేషన్ కు రావడం, శైలజానాథ్ కు ప్రథమ చికిత్స అందించడం, అదీ పోలీసు అయి ఉండి మానవత్వం చూపడంతో రవికిరణ్ పై ప్రశంసలు లభిస్తున్నాయి.












Click it and Unblock the Notifications