పోలీస్ స్టేషన్‌పై దాడి, పరుగు తీసిన ఎస్సై

Chittor Map
చిత్తూరు: జిల్లాలో పోలీసు స్టేషన్ పైన గ్రామస్థులు దాడి చేయడంతో ఎస్సై బయటకు పరుగు తీసిన సంఘటన చోటు చేసుకుంది. ఓ హత్యకేసులో నిందితులను వదిలేశారన్న కారణంతో గ్రామస్థులు రామసముద్రం మండలంలో పోలీసు స్టేషన్ పైన బుధవారం చేశారు. గ్రామస్థులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఎస్‌ఐ బయటకు పరుగులు తీశారు.

నెలరోజుల కితం రామసముద్రం మండలం ఆర్ నడింపల్లె పంచాయతీ ఆర్ కమతంపల్లెకు చెందిన వెంకటప్ప అదృశ్యమై రెండు రోజుల క్రితం శవమై కనిపించాడు. వెంకటప్ప మృతిపై గ్రామస్థులు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆక్రోశానికిలోనై గ్రామస్థులతో కలిసి స్టేషన్‌ను ముట్టడించి స్టేషన్‌లోకి చొరబడ్డారు. దాడికి యత్నించారు. దీంతో ఎస్సై బయటకు పరుగురు తీశారు. పక్కనే ఉన్న కొందరు యువకులు వారిని వారించి పుంగనూరు సిఐకి సమాచారం అందించారు.

కాగా, పూర్వాపరాలు విచారిస్తే వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకటప్ప తన భార్యను మందలించాడు. దీంతో ఆమె ప్రియుడు వెంకటరమణా రెడ్డి సాయంతో పథకం ప్రకారం అటవీ ప్రాంతంలో వెంకటప్పను హతమార్చారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. నెలరోజుల కితం నుంచి ఇంటికి రాకుండా, కన్పించకుండా పోవడంతో మూడువారాల కితం కుటుంబ సభ్యులు రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో వెంకటప్ప అదృశ్యంపై ఫిర్యాదు చేశారు.

అటవీ ప్రాంతంలో కుళ్లిన మృతదేహాన్ని కొన్నాళ్లకు పోలీసులు కనుగొన్నారు. మృతదేహం వెంకటప్పదిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో హత్య కేసులో అనుమానితులను విచారించి అరెస్టు చేయకుండా వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతుడు సోదరుడు గంగప్ప పోలీస్‌స్టేషన్ ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడి దాడికి యత్నించారు. స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి అనుమానితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సిఐ వారితో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+