వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !!
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భక్తి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పవిత్ర సమయంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఏపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. భక్తి, ఆచారాలు ప్రధానంగా ఉండాల్సిన వేళ, ఒక దేవస్థానం చైర్మన్‌కు సంబంధించిన వివాదాస్పద వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది.
నెల్లూరు జిల్లాలో ఘటన... వైరల్ వీడియో కలకలం
నెల్లూరు జిల్లా పరిధిలోని చిల్లకూరు మండలం తమ్మిపట్నం వద్ద ఉన్న కోదండ రామస్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయనతో పాటు మరికొందరు వ్యక్తులు ఓ మహిళతో కలిసి గెస్ట్ హౌస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బట్టలు విప్పి డ్యాన్స్ చేయడం, అశ్లీలంగా ప్రవర్తించడం వంటి దృశ్యాలు ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ ఘటనలో ముత్యాలమ్మ కనుపూరు దేవస్థానం మాజీ బోర్డు సభ్యుడు శివ కుమార్, అలాగే దువ్వూరు వినయ్ రెడ్డి వంటి వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరంతా కలిసి గానా బజానా చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో, ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం కాకుండా దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే ఘటనగా భావిస్తున్నారు. ఈ ఘటనలో పేర్లు వినిపిస్తున్న వ్యక్తులు Telugu Desam Partyకి చెందినవారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా దాల్చింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా ఎత్తిచూపుతుండగా, అధికార పార్టీ నేతలు కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ పరువు బజారున పడుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక దేవస్థానం చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యవహారాల్లో ఉండడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పదవుల నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా, దేవస్థానాల నిర్వహణలో ఉన్నవారి ప్రవర్తనపై కఠిన నియమాలు అవసరమని కూడా పలువురు సూచిస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భక్తి స్థలాలకు సంబంధం ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రవర్తన చేయడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అంతే కాకుండా కొంతమంది దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెట్టాలని కోరుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? గెస్ట్ హౌస్ ఎక్కడిది? వీడియో నిజమా కాదా? వంటి ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. వీడియో నిజానిజాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు దీనిపై విచారణ ప్రారంభిస్తే మాత్రమే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications