వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి, విక్రయాల రికార్డు ; అయినా సరే ప్రైవేటీకరిస్తాం, లేదంటే మూసేస్తామన్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మొండిగానే ముందుకు వెళుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోమని తేల్చి చెబుతోంది. ఉక్కు పరిశ్రమ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరణ చేస్తామని, అలా కుదరని పక్షంలో వాటి శాశ్వతంగా మూసివేస్తామని, ఇదే తమ నూతన పబ్లిక్ సెక్టార్ విధానమని కేంద్రం స్పష్టం చేస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ విధంగా బదులిచ్చింది.

కేంద్రం దిగొచ్చే వరకు విశాఖ ఉక్కు ఉద్యమం ; ఢిల్లీలో హోరెత్తుతున్న మహాధర్నాలో వైసీపీ, టీడీపీ ఎంపీలుకేంద్రం దిగొచ్చే వరకు విశాఖ ఉక్కు ఉద్యమం ; ఢిల్లీలో హోరెత్తుతున్న మహాధర్నాలో వైసీపీ, టీడీపీ ఎంపీలు

 ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదన్న కేంద్రం

ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదన్న కేంద్రం

విశాఖ ఉక్కు పరిశ్రమలో వంద శాతం వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పార్లమెంట్ లో మరోమారు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసినప్పటికీ, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. కార్మికులు ఆందోళన చేసినా, స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నా స్టీల్ ప్లాంట్ వాటాల ఉపసంహరణ విషయంలో పునరాలోచన చేసేది లేదని స్పష్టంగా తేల్చి చెబుతోంది కేంద్రం.

కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన

కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన


ఒకపక్క కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కార్మికుల ఉద్యోగుల, బతుకులను రోడ్డున పడేయవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఢిల్లీలో ఆందోళన బాట పట్టిన కార్మిక లోకం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మహాధర్నా ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది.

ప్రైవేటీకరణ సాధ్యం కాకుంటే శాశ్వతంగా మూసేస్తాం

ప్రైవేటీకరణ సాధ్యం కాకుంటే శాశ్వతంగా మూసేస్తాం

కానీ ఇవేవి పట్టని కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చాలా స్పష్టంగా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేల్చి చెబుతోంది. అలా వీలు కాకుంటే శాశ్వతంగా మూసివేస్తామని వెల్లడించింది.ఇదిలా ఉంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న చందంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ కొత్త రికార్డును సాధించింది. జులై నెలలో 540.8 టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది విశాఖ స్టీల్ ప్లాంట్.

 విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాల్లో, ఉత్పత్తిలో రికార్డు

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాల్లో, ఉత్పత్తిలో రికార్డు


గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిగినట్లుగా సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ జూలై మధ్య 1538 వేల టన్నుల ఉక్కును విక్రయించినట్లుగా ఆర్ఐఎన్ ట్విట్టర్లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్ జూలై మధ్య నాలుగు నెలల కాలంలో ఎనిమిది శాతం అదనంగా విక్రయాలు జరిపినట్లుగా పేర్కొంది.ఒక పక్క కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని,లేదంటే శాశ్వతంగా మూసివేస్తామని పదేపదే చెబుతున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు రికార్డు నెలకొల్పడం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

India, UK To Conduct Clinical Trials Of Ashwagandha Plant For Treating Covid-19 || Oneindia Telugu
మెరుగైన పని తీరు చూపిస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ ఉనికి ప్రశ్నార్ధకం

మెరుగైన పని తీరు చూపిస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ ఉనికి ప్రశ్నార్ధకం

ఇప్పటికే కరోనా సమయంలోనూ ప్రజల ప్రాణవాయువు అవసరాలను విశేషంగా తీర్చిందని, ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పనితీరుపై ప్రకటన చేశారు. ఇక ఈ సమయంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి, విక్రయాలు జరిపి విశాఖ స్టీల్ ప్లాంట్ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్న వేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిజంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఆవేదనకు గురి చేసే అంశమే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం ఆ విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తుండటం గమనార్హం.

English summary
The Center has made it clear that it will privatize public sector enterprises such as the steel industry if possible, and if not, close them permanently. Meanwhile, the Steel Plant has set a record in production and sales from April to July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X