'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు (ఫోటోలు)

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత వైయస్ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను విశాఖ టీడీపీ నేతలు 'రామరాజ్యంలో రావణ కాష్ఠ' పేరుతో వినూత్న నిరసన చేపట్టారు. జగదాంబ సెంటర్‌లో సోమవారం రాత్రి కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు.

వైయస్ జగన్ మాస్క్‌లతో ముగ్గురు వ్యక్తులను రోడ్డుపై పడుకోబెట్టి చీపుర్లతో ఊడ్చుతూ వారిని దొర్లించారు. అనంతరం జగన్ ప్లెక్సీలను చీపుర్లతో కొట్టారు. జగన్ బొమ్మను రావణాసుడిలా పది తలలతో రూపొందించి కాగడాలతో తగల బెట్టారు. సైకో జగన్ చేష్టలకు ఎమ్మెల్యేలు పార్టీ వదిలి పారిపోతుంటే మతి భ్రమించి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామరాజ్యం వంటి చంద్రబాబు పాలనలో రావణుడులా జగన్ తయారయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుది రామరాజ్యపాలన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబారు అహర్నిశలూ శ్రమిస్తుంటే, జగన్ రావణుడిలా అడుగడుగునా అడ్డుతగులుతున్నారని దుయ్యబట్టారు.

 'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

జగన్ పెద్ద సైకో అని విమర్శించారు. సైకో నాయకుడి ప్రవర్తన నచ్చకే వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని మండిపడ్డారు. దీంతో జగన్‌కు మతి భ్రమించి పిచ్చెక్కినట్లు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

దీనికి తోడు ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు తక్షణమే తేల్చాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో తాను జైలుకెళ్లడం ఖాయమనే భయం జగన్‌కు పట్టుకుందన్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్ధంకాక చంద్రబాబును దూషిస్తున్నాడన్నారు.

 'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

రావణుడిలా మారిన జగన్, వైసీపీ అంతమొందే రోజు తొందరలోనే ఉందన్నారు. ప్రజలే జగన్‌ను తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, మైనార్టీ నేత ఎండీ నజీర్‌తో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు.

 'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

మతి భ్రమించి సైకోలా సీఎం చంద్రాబబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేత వైయస్ జగన్ తీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రజలే అతడికి తగిన బుద్ధి చెబుతారని తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు.

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం జగన్ దిష్టిబొమ్మను లాసెన్స్ బే కాలనీ కూడలిలో దహనం చేశారు. ముందుగా కేడీపీఎం స్కూల్‌ నుంచి జగన్ ఫ్లెక్సీతో లాసెన్స్ బే కాలనీ వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.

 'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

'రామరాజ్యంలో రావణాసురుడు': జగన్ ప్లెక్సీలకు చీపురు దెబ్బలు

అనంతరం ప్లెక్సీని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పట్టాభిరామ్, బైరెట్టి పోతున్నరెడ్డిలోత పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+