ఇంకుబేషన్ సెంటర్‌గా, వెంకయ్య పట్టుదల: చంద్రబాబు
విశాఖపట్నం: విశాఖపట్టణంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాగా చదివిన పిల్లలకు ప్రతిభా అవార్డులు, బాగా చదువు చెప్పిన ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. విశాఖను వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
టాస్క్‌ఫోర్స్ ద్వారా అన్ని ఉత్తమ విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని చంద్రబాబు సభాముఖంగా కోరిన వెంటనే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దానికి ఆమోదం తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద ఐఐఎంకు స్మృతి ఇరానీ శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. ఉన్నత విద్యలో రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన అన్నారు. ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని కుమార మంగళం బిర్లాను కోరగా సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

విశాఖ జిల్లాను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అన్నారు. చదువుకు ఎంతో ప్రాధాన్యం ఇస్త్తామని అన్నారు. పేదరికం పోవాలంటే అభివృధ్ధి జరగాలన్నారు. మొన్నే విశాఖపట్టణంలో హుదుద్ తుపాను వచ్చినా దాన్ని ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్నార న్నారు. విశాఖపట్టణంను స్మార్ట్ సిటీగా చేసేందుకు త్వరలో ఎంవోయూ చేసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. దక్షిణాదిలోనే వెంకయ్య లాంటి పట్టుదల ఉన్న వ్యక్తి లేరని సీఎం అన్నారు. పేదవారి ఆనందంగా ఉండాలని, తెలగుజాతి ఆనందంగా ఉండటానికి పనిచేస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు. కష్టపడి పనిచేద్దామని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
విశాఖ ఐఐఎంను జాతికి అంకితం చేస్తున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని అన్నారు. బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ ఐఐఎం శంకుస్థాపనకు వచ్చామని అన్నారు. విశాఖ ఐఐఎంను అభివృద్ధి చేసే బాధ్యతను బెంగళూరు ఐఐఎంకు అప్పగించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ ఐఐఎంలో ప్రవేశాలు ప్రారంభమవుతాయని స్మృతి ఇరాని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేస్తోందన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచామని స్మృతీ ఇరాని తెలిపారు.












Click it and Unblock the Notifications