ఎన్నాళ్లకెన్నాళ్లకు: విశాఖ ఎంపిగా స్థానిక నేత

హైదరాబాద్: పాతికేళ్ల తర్వాత విశాఖపట్నం స్థానిక నేతను తమ పార్లమెంటు సభ్యుడిగా చూసింది. స్థానికేతర నేత అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మను ఓడించి స్థానికుడైన బిజెపి నేత కంభంపాటి హరిబాబు విజయం సాధించారు.

విశాఖపట్నం నుంచి 1989లో ఆనంద గజపతిరాజు మాజీ భార్య ఉమ కాంగ్రెసు టికెట్‌పై విజయం సాధించారు. నెల్లూరు జిల్లాకు చెందిన టి. సుబ్బిరామిరెడ్డి 1996, 1998 ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

Visakhapatnam gets local MP after a long time

1991, 1999ల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గీతం చీఫ్ ఎంవివిఎస్ మూర్తి విశాఖపట్నం లోకసభ స్థానం గెలుచుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్ జనార్దన్ రెడ్డి 2004 ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి 2009 ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 1984లో స్థానిక నేత విశాఖపట్నం లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. భాట్టం శ్రీరామమూర్తి 1984 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+