చేతులు కట్టేసి పోలీసు జీపులోకి: కన్నీళ్లు పెట్టుకున్నాడు (ఫోటోలు)
అమరావతి: విశాఖపట్నంలోని రామకృష్ణ కూడలి వద్ద గల రైతు బజారును తొలగించడానికి జీవీఎంసీ అధికారులు చేసిన ప్రయత్నం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇటు అధికారులు, అటు వ్యాపారుల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది.
వివరాల్లోకి వెళితే.... కొబ్బరితోట పార్కు స్థలంలో వెలసిన రైతుబజార్‌లోని దుకాణాలను తొలగించడానికి శనివారం ఉదయం 9 గంటలకు జీవీఎంసీ జోన్-3 ఇన్‌ఛార్జీ జెడ్సీ బాపిరాజు, ఏసీపీ జయరామ్‌తో పాటు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. రైతుబజారును తక్షణం ఖాళీ చేయలంటూ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
దీంతో తమకు అన్నం పెట్టిన దుకాణాలను జేసీబీలతో అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తే వెళతామని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామని వ్యాపారులు అధికారులను హెచ్చరించారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు దుకాణాలు తొలగించుకునే సమయం ఇవ్వలేదని మహిళలు బోరున విలపించారు. వ్యాపారానికి సరైన స్థలం కేటాయిస్తే తాము ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చిరువ్యాపారి
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, వైసీపీ నార్త్ నియోజకవర్గం సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ జీవీఎంసీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అసలు వివాదం ఎలా తలెత్తిందంటే రామకృష్ణ కూడలిలోని సర్వే నెంబరు 129లో జీవీఎంసీకి 1800 గజాల స్థలం ఉంది.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చిరువ్యాపారి
దీన్ని ఉద్యానవనంగా జీవీఎంసీ ఏర్పాటుచేసింది. ఇదిలా ఉండగా పూర్ణామార్కెట్ సమీప ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించుకుంటున్న వ్యాపారులను 2000 సంవత్సరంలో నాటి నగరపాలక సంస్థ కమిషనర్ శర్మ లక్ష్మీటాకీస్ ప్రాంతానికి తరలించారు.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చిరువ్యాపారి
అక్కడి నుంచి 2004లో రామకృష్ణ కూడలి సమీప ప్రాంతానికి 83 మంది వ్యాపారులను తరలించారు. వారంతా పార్కుకు ఉద్దేశించిన 1800 గజాల స్థలంలో దుకాణాలు ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఈ దుకాణాలను తొలగించాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో కేసువేశారు.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చిరువ్యాపారి
దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం పార్కుల్లో ఎలాంటి నిర్మాణాలు కానీ, దుకాణాలు కానీ ఏర్పాటుచేయరాదని, ఒకవేళ అలాంటివి ఉంటే వెంటనే తొలగించాలని 2010లో తీర్పునిచ్చింది. అప్పటినుంచీ ఈ దుకాణాలను ఖాళీ చేయిద్దామని ప్రయత్నించిన జీవీఎంసీ అధికారులకు నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చిరువ్యాపారి
మరోవైపు వ్యాపారులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో శనివారం అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి ఈ దుకాణాలను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో కళ్లముందే జీవనాధారం పోతుంటే తట్టుకోలేని నాయిని నాగిరెడ్డి అనే వ్యక్తి తనపై కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకునే ప్రయత్నం చేశారు.

కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన చిరువ్యాపారి
దీనిని గమనించిన పోలీసులు అతన్ని నిలువరించి స్టేషన్‌కు తరలిస్తున్న తరుణంలో మార్కెట్ మీదుగా వెళ్తున్న ఓ ఆటో టైర్ కింద తలపెట్టేందుకు మరో మారు ప్రయత్నం చేశాడు. దీంతో నాగిరెడ్డిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా వ్యాపారులు గుమిగుడి ఉండడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి పలువురిని 2, 3, 4వ పట్టణ పోలీసుస్టేషన్లకు తరలించారు.












Click it and Unblock the Notifications