ఒకే రోజు 4 చోరీలు: సెల్ ఫోనే పట్టించింది(ఫోటోలు)
విశాఖపట్నం: ఒకే రోజు ఒకే కాలనీలో నాలుగు చోరీలు చేసిన ముఠాను నగర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్ ఆ వివరాలను వెల్లడించారు. ఏడుగురు నిందితులు ఒక ముఠాగా ఏర్పాడి ఇళ్లలో చోరీలు చేస్తున్నారని సీపీ తెలిపారు.
రాజమండ్రికి చెందిన అంబటి మధు(26), పశ్చిమగోదావరి జిల్లా కోయలగూడెం నివాసి తోట శివభవానీ(26), కామవరపుతోట మండలం కొండగూడెంకు చెందిన చీకట్ల సతీష్ (22), విశాఖ నగరం టీపీటీ కాలనీకి చెందిన వేముల వినయ్ కుమార్ (21), అరిలోవ నివాసి బిట్ల కీర్తి ప్రియ (25), వేముల శాంతి ప్రియ (22), వేముల పుష్పలత (48) ఈ ఏడుగురు వీరు గతంలో పలు నేరాలు చేసి రాజమండ్రి, విశాఖ సెంట్రల్ జైళ్లలో శిక్ష అనుభవించారు.
అక్కడ ఏర్పడ్డ పరిచయాలతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. విశాఖ నగర వీధుల్లో సంచరిస్తూ రెక్కీ నిర్వహించేవారు. గత డిసెంబర్ 31న కేఆర్ఎం కాలనీలో నాలుగు ఇళ్లలో చోరీలు చేసి పెద్ద మొత్తంలో నగుదు, బంగారం, వెండి ఆభరణాలు చేజిక్కించుకుని పరారయ్యారు.

ఒకే రోజు 4 చోరీలు: సెల్ ఫోనే పట్టించింది
బాధితులు స్ధానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు నిఘా పెంచారు.

ఒకే రోజు 4 చోరీలు: సెల్ ఫోనే పట్టించింది
ఈ ఏడుగురి ముఠాలో ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవార అదుపులోకి తీసుకున్నారు. వీరు 23 చోరీ కేసుల్లో పాల్గొన్నారని సీపీ వివరించారు.

ఒకే రోజు 4 చోరీలు: సెల్ ఫోనే పట్టించింది
ఈ నిందితుల్ని వారి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నామని సీసీఎస్ సీఐ బాబ్జీరావు తెలిపారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడైన అంబడి మధుని ఎనిమిది నెలల క్రితమే వేరే కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒకే రోజు 4 చోరీలు: సెల్ ఫోనే పట్టించింది
ఆ సమయంలో నిందితుడి వివరాలు, సెల్ ఫోన్ నెంబర్, దాని ఐఎంఈఐ నెంబర్‌ను తీసుకున్నారు. కాగా ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పాత నిందితులపై నిఘా వేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు మధు నగరానికి వచ్చే వెళ్లేటప్పుడు సెల్ ఫోన్ నెట్ వర్కింగ్ ద్వారా వివరాలు రాబట్టారు.

ఒకే రోజు 4 చోరీలు: సెల్ ఫోనే పట్టించింది
అప్పటికే సుమారు 60 నుంచి 70 సిమ్ కార్డులను మార్చిన అంబటి మధు సెల్ ఫోన్‌ను మార్చక పోవడంతో దాని ఆధారంగా నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications