పక్క రాష్ట్రంలో ఉంటావా, ముందు ఇక్కడకు రా: పవన్ కళ్యాణ్‌కు టిడిపి

ఆర్కే బీచ్ నిరసనకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ: ఆర్కే బీచ్ నిరసనకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ జనసేన అధినేతపై విమర్శలు గుప్పించారు.

పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. ఇక్కడకు రా.. అని ఆగ్రహించారు. పక్క రాష్ట్రంలో ఉండి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఆర్కే బీచ్ నిరసన సమయంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా అని నిలదీశారు.

Vishaka TDP leaders target Jana Sena chief Pawan Kalyan

కాపు ఉద్యమంలో అనుకోకుండా కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు. మీరు ఎక్కడ కూర్చోని మాట్లాడుతున్నారో గుర్తించాలన్నారు. ముందు ఇక్కడకు వచ్చి మాట్లాడాలని సూచించారు. కేంద్రాన్ని విమర్శించరని, ఢిల్లీ వెళ్లరని ఎద్దేవా చేశారు.

ప్రపంచం మొత్తం మనవైపు చూస్తున్న సమయంలో విధ్వంసం సృష్టించాలని చూస్తారా అని వంగలపూడి అనిత వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆర్కే బీచ్ నిరసన చేపట్టారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+