రెండు బీర్లు తాగాను, మత్తు ఎక్కువైంది, విశాఖ గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు ముమ్మరం

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: విందు పేరుతో హోటల్ కు పిలిచి ఓ ఆంగ్లో ఇండియన్ మహిళపై అత్యాచారం చేసిన సంఘటనపై మూడో పట్టణ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించారు.

బాధితురాలి శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. శనివారం రాత్రి ఇంటికి పంపించేశారు. పిర్యాదుచేసే సమయానికి ఆమె షాక్ నుండి కోలుకోలేదు. ప్రస్తుతం కోలుకోవడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Vishakapatnam police speedup gangrape case.

శనివారం నాడు పోలీసులు వారింటికి వెళ్ళి తల్లిదండ్రులతో కూడ మాట్లాడారు. మత్తులో ఉన్న సమయంలో తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని అడ్డుకొనేందుకు తాను తీవ్రంగా ప్రతిఘటించినా ఫలితం లేకపోయిందని బాధితురాలు చెప్పారు. ఈ పెనుగులాటలోనే ఆమెకు గాయాలైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

రెండు బీర్లు మాత్రమే తాగానని, ఎంతో వచ్చిందని ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులు మద్యంలో మత్తుమందు కలిపి ఉంటారనే కోణంలో కూడ విచారణ చేస్తున్నారు.

నిందితుల్లో ఒకరు బయటివ్యక్తేనన్న విషయం మాత్రం ఖరారైంది. ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారన్నదానిపై బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిందితుడిగా ఉన్న శ్రీధర్, అతని మిత్రుడు వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vishakapatnam police speedup gangrape case. Saturday night anglo indian gangraped in a hotel. police searching for evidence.
Please Wait while comments are loading...