ఎన్నికల్లోపు విభజన జరగదు: విశాలాంధ్ర మహాసభ

శాసనసభ సమావేశాలు మొదలై ఐదు రోజులు గడుస్తున్నా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, చర్చ జరగకుండా అడ్డుపడుతుండటం దురదృష్టకరమన్నారు. స్ధానిక ఎన్‌జిఓహోమ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాలాంధ్ర మహాసభ నాయకురాలు ఆకుల లక్ష్మి, న్యాయవాదుల జెఎసి కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, ప్రొఫెసర్ రమేష్ తదితరులు మాట్లాడారు.
సమైక్య ఉద్యమాల్లో ఎన్నడూ పాల్గొనని వారు శాసనసభలో బిల్లుపై చర్చకు అడ్డుపడటం విడ్డూరంగా వుందని వారు విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభలో ఓటు వేయని వారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని, వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని వారు తెలిపారు.
ఇప్పటికైనా రాజకీయనాయకులు పశ్చాత్తాపం చెంది శాసనసభలో బిల్లుపై చర్చలో పాల్గొనాలని, వాస్తవాలు తెలియచేసి బిల్లును ఓడిరచాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications