ముందు ఆలోచించుకోవాలి: జగన్‌కు విష్ణు కుమార్ రాజు కౌంటర్
హైదరాబాద్: తాము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేరిన విషయంపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెపి శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు ఖండించారు. సగం మంది బిజెపి సభ్యులు పచ్చ కండువాలు కప్పుకున్నారని వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు.
తాము టిడిపి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఎన్నడూ పచ్చ కండువాలు కప్పుకోలేదని, తమది జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. టిడిపి ప్రభుత్వ నిర్ణయాలను సంపూర్ణంగా సమర్థిస్తూ వారితో కలిసి తమపై బిజెపి శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి తీరుపై జగన్ అన్నారు.

బిజెపి జాతీయ పార్టీ అని, ఆ స్థాయి పార్టీపై విమర్సలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఆయన జగన్‌కు సూచించారు. సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాల్సిందేనని, లేనిపక్షంలో సభను బహిష్కరిస్తామని జగన్ చెప్పారు.
అయితే, తాము సస్పెన్షన్ ఎత్తేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాయ్ కాట్ చేసినా, కోర్టుకు వెళ్లినా తాము రోజా సస్పెన్షన్‌ను ఎత్తేయబోమని ఆయన అన్నారు. ఈ సమయంలో బిజెపి తీరుపై జగన్ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications