అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుపై బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పూటకో మాట మాట్లాడుతున్నానని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడాన్ని విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు.

తాను ఎప్పుడు మాట మార్చానో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఒకే మాటపై నిలబడే వ్యక్తినని విష్ణుకుమార్ రాజు చెప్పారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగేముందు ఒకటికి రెండుసార్లు నిజానిజాలను నిర్ధారించుకోవాలని విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు.

Vishnukumarraju made allegations on minister Achenaidu

ఒకరి వ్యక్తిత్వంపై విమర్శలు చేసే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.

నీతి, నిజాయతీలతో కూడిన రాజకీయాలను మాత్రమే తాను చేస్తానని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అచ్చెన్నాయుడిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+