జూనియర్ ఎన్టీఆర్ బాటలో ఏపీకి విరాళం ప్రకటించిన విశ్వక్ సేన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఏపీలో ఎనలేని నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతి చెందారు. మరోవైపు 73 చెరువులకు గండిపడగా, 1808 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. అపార పంట నష్టం జరిగింది.

ఏపీ వరదలతో అపార నష్టం
ఆంధ్రప్రదేశ్లో ముంపు బాధిత ప్రాంతాలలో జరిగిన నష్టాలు, చేపడుతున్న సహాయక చర్యలతో విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తాజాగా బులిటెన్ విడుదల చేశారు. అపార ప్రాణ నష్టాన్ని నివారించటానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మొత్తం 176 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి 41, 927 మందిని ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.

Vishwak Sen announced donation to AP on the path of Junior NTR

తెలంగాణాలోనూ అపార ప్రాణ, ఆస్తి నష్టం
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ అనేక చోట్ల వర్షాలు వరదల కారణంగా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరదలతో ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో వరద బీభత్సం వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులపైన సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, యువ హీరోలు స్పందిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్ కూడా
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే విశ్వక్ సేన్ జూనియర్ బాటలో తన వంతుగా విరాళం ప్రకటించారు.

విశ్వక్ సేన్ చిరు విరాళం
ఏపీ ప్రభుత్వానికి అండగా తన వంతుగా ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు మాత్రమే అని పేర్కొన్నారు.

ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్న సినీ ప్రముఖులు
ఇక ఇప్పటికే ఏపీ వరదలపై స్పందించిన నిర్మాత అశ్వినీదత్ కూడా వైజయంతి మూవీస్ పేరుతో ఏపీకి 25 లక్షల విరాళం ప్రకటించారు. ఇక ఒక్కొక్కరుగా ఏపీ, తెలంగాణా వరదలపై స్పందిస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. బాధితులకు భరోసా ఇవ్వటానికి మేము సైతం అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+