Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్ కు గంటా 20 ప్రశ్నలు-రాజధాని లేకుండా పెట్టుబడులా ? కంపెనీల్ని వెళ్లగొట్టారుగా..!

ఏపీలో టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రేపు వైజాగ్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ప్రభుత్వానికి 20 ప్రశ్నలు సంధిస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు.

ఏపీలో వైసీపీ సర్కార్ రేపు, ఎల్లుండి విశాఖ వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించబోతోంది. ఈ సదస్సుకు విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హాజరవుతున్నారు. రెండు లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాల్ని ప్రశ్నిస్తూ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఎందుకీ హడావిడి చేస్తోందంటూ టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సీఎం జగన్ కు ఇవాళ లేఖ రాశారు.

వైజాగ్ సదస్సుపై జగన్ కు గంటా లేఖ

వైజాగ్ సదస్సుపై జగన్ కు గంటా లేఖ

వైజాగ్ లో రేపు, ఎల్లుండి ప్రభుత్వం నిర్వహించనున్న పెట్టబడుల సదస్సు నేపథ్యంలో సీఎం జగన్ కు స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లేఖ రాశారు. ఈ లేఖలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు. 20 ప్రశ్నలతో కూడిన ఈ లేఖలో గంటా శ్రీనివాస్ పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. రాజధాని లేని రాష్ట్రంలో, సొంత ఉద్యోగులకు జీతాలివ్వని ప్రభుత్వాన్ని పెట్టుబడిదారులు ఎలా నమ్ముతారని గంటా ప్రశ్నించారు. తాను లేవనెత్తిన అంశాలకు సానుకూల స్పందన ఆశిస్తున్నట్లు తెలిపారు.

రాజధాని లేకుండా, జీతాలివ్వని రాష్ట్రంలో పెట్టుబడులా ?

రాజధాని లేకుండా, జీతాలివ్వని రాష్ట్రంలో పెట్టుబడులా ?

సీఎం జగన్ కు రాసిన లేఖలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ దావోస్ కు ఈ ఏడాది సీఎం జగన్ వెళ్లకపోవడాన్ని తప్పుబట్టారు. పెట్టుబడుల స్వర్గధామం అయిన దావోస్ కు ఎందుకు వెళ్లలేదనే అంశంపై సరైన కారణాలు చెప్పగలరా, దీని వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో గుర్తించారా అని గంటా ప్రశ్నించారు. అలాగే రాజధానినే నిర్మించుకోని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకం కలిగించగలమంటూ అడిగారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు మొదటి తేదీ నుంచి చివరి తేదీ వరకూ ఎందుకు తీసుకుంటున్నారని అడిగారు. తన ఉద్యోగులకు జీతాలివ్వని ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పగలరా అన్నారు.

కంపెనీల్ని వెళ్లగొట్టి ఇప్పుడు..

కంపెనీల్ని వెళ్లగొట్టి ఇప్పుడు..

జాకీ అనే అండర్ వేర్ కంపెనీ రాష్ట్రంలో ఉండలేని పారిపోతుంటే కారణాలు విశ్లేషించి, తప్పుల్ని సరిదిద్దుకుని పునరావృతం కావన్న భరోసా ఇచ్చారా అంటూ గంటా శ్రీనివాస్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. కియాకు అనుబంధ కంపెనీలు తీసుకురాలేకపోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా అని అడిగారు. హెచ్ఎస్బీసీ ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా ఆపే ప్రయత్నం చేసారా అని నిలదీశారు. లులూని ఇక్కడి నుంచి తరిమేశామని ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చెప్తారా అని జగన్ ను ప్రశ్నించారు. అమరరాజా బ్యాటరీస్ ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టామని చెబుతారా అని అడిగారు. 2019లో విశాఖలో 50 వేల మంది ఐటీ ఉద్యోగులుంటే ఇప్పుడు 2,3 వేలకు ఎందుకు తగ్గిపోయారని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఒక్క కంపెనీకి రూపాయి అయినా ఇచ్చారా అని అడిగారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ఫిన్ కార్ప్ కంపెనీలు విశాఖ నుంచి ఎందుకు వెళ్లిపోయాయని ప్రశ్నించారు. అదానీ డేటా సెంటర్ కు గతంలోనే శంఖుస్ధాపన జరిగినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు, మళ్లీ భూమి కేటాయింపు వెనుక రహస్యం ఏంటన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడుల్ని ఆహ్వానించగలమా అని గంటా ప్రశ్నించారు.

భోగాపురం కట్టుంటే ..

భోగాపురం కట్టుంటే ..

రేపు నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు 25 ఛార్జర్ట్ ఫ్లైట్స్ వస్తున్నాయంటున్నారని, విశాఖ ఎయిర్ పోర్టులో 18కే పార్కింగ్ స్ధలం ఉందని గంటా శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం ప్రారంభించి ఉంటే ఈ సమస్య ఉండేదా అని జగన్ సర్కార్ ను ఆయన ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్ పోర్టును నాలుగేళ్లుగా శంఖుస్ధాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్లలో అప్పటికే రాష్ట్రంలో ఉన్న పోర్టులు మినహా ఒక్కటైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు.

పెట్టుబడుల సదస్సు వెనుక ధైర్యమేంటి ?

పెట్టుబడుల సదస్సు వెనుక ధైర్యమేంటి ?

పారిశ్రామిక వేత్తల్లో ఎలాంటి నమ్మకం కల్పించకుండా పెట్టుబడుల సదస్సు పెట్టే సాహసం వెనుక మీ ధైర్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అని గంటా శ్రీనివాస్ వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. సరైన ఉపాధి అవకాశాల్లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా అని అడిగారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాక చివరి ఏడాది పెట్టుబడుల సదస్సు పేరుతో ఈ హడావిడి వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి ఎంతమాత్రం కాదు, మన రాష్ట్రంలో సగటు పౌరుని సందేహాలు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానంటూ ముగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+