Vizag Skywalk Bridge: వైజాగ్ అందాలకు ఏకైక వ్యూపాయింట్..! 862 ఫీట్ ఎత్తులో..! ఇవాళ్టి నుంచే..!
ఏపీలో పర్యాటక రాజధాని విశాఖపట్నంలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. అయితే ఇవన్నీ ఒక్కో చోట ఉండటంతో పర్యాటకులు ప్రతీ చోటా వాటిని చూసేందుకు సమయం వృథా చేసుకోవాల్సి వస్తోంది. అయితే వీటిలో చాలా మటుకు కవర్ చేసేలా తాజాగా ఓ సింగిల్ వ్యూపాయింట్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఇవాళే ప్రారంభించారు. ఇది విశాఖ వాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతులు పెంచబోతోంది.
విశాఖలోని కైలాసగిరిపై ఇవాళ ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. రూ.7 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే విశాఖ వాసులే ఎప్పుడూ చూడని అందాలు కనువిందు చేయబోతున్నాయి. అయితే దీనిపై ఒకేసారి 40 మంది సందర్శకులు మాత్రమే వెళ్లేందుకు ఛాన్స్ ఉంది.

ఈ ఐకానిక్ స్కైవాక్ బ్రిడ్జిపై నుంచి విశాఖ సముద్ర అందాలు, తూర్పు కనుమలు, నగర సౌందర్యాన్ని తిలకించే అవకాశం ఉంది. కాబట్టి విశాఖ టూరిజంతో పాటు ఏపీ టూరిజంలోనూ ఇదే మైలురాయి కాబోతోంది. ముఖ్యంగా విశాఖ నగరాన్ని, సముద్ర తీరాన్ని ఇప్పటివరకూ దగ్గరి నుంచి మాత్రమే చూస్తున్న వారికి ఈ వ్యూపాయింట్ అద్భుతమైన అనుభవాన్ని పంచనుంది. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ బ్రిడ్జి పనులు తాజాగా పూర్తి కావడంతో ఇవాళ్టి నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చారు.













Click it and Unblock the Notifications