• search
  • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్‌పై ఆగ్రహాం

|

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలకు సంబంధించి మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నా, పెద్ద ఆలయాల్లో తరచూ అనూహ్య సంఘటనలు జరుగుతుండగా, తాజాగా విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక బోడి కొండపై ఉన్న కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తనను నరికేసి, తుప్పల్లో పడేసిన ఘటన సంచలనం రేపింది. ఇంకొద్ది గంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాలో పర్యటించనుండా ఈ సంఘటనపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తాయి..

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంగా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థంలో గల కోదండరామ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర, విశిష్టత ఉన్నాయి. ప్రధాన ఆలయంతోపాటే అదే ఊరిలోని బోడి కొండపైనా దేవతామూర్తులతో ఆలయం ఉంది. కొండపైనున్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల ఖండనకు గురై, సమీపంలోని తుప్పల్లో పడి ఉండటాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారన్న సమాచారంతో రామతీర్థం గ్రామస్తులు వందలాదిగా బోడి కొండపైకి వెళ్లారు. జిల్లా ఎస్పీ రాజకుమారి సైతం అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ ను పురమాయించారు. కేసు నమోదు చేసుకుని, దుండగులను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ మీడియాకు తెలిపారు.

పార్టీ నేతల పరుగులు.. ధర్నాలు..

పార్టీ నేతల పరుగులు.. ధర్నాలు..

ఏపీలోనే కాక, దేశవ్యాప్తంగానూ గుర్తింపు పొందిన ఆలయాల్లో ఒకటైన రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ఖండనకు గురైందన్న వార్త వినగానే అన్ని పార్టీల నేతలు బోడి కొండకు పరుగులు తీశారు. స్థానిక నెల్లిమర్ల వైసీపీ ఎంపీ అప్పలనాయుడు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆలయాలపై దాడులు అలవాటుగా మారిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముష్కరులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా బీజేపీ చీఫ్ పావని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీడీపీ జిల్లా నాయకులు రవిశంకర్ సహా పలువురు నేతలు ఆందోళనలను చేపట్టారు. నిజానికి..

 సీఎం జగన్ పర్యటనకు ముందే..

సీఎం జగన్ పర్యటనకు ముందే..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా పర్యటనకు కొద్ది గంటల ముందే రామతీర్థం ఆలయంలో విగ్రహ ధ్వంసం చోటుచేసుకోవడం గమనార్హం. బుధవారం విజయనగరానికి రానున్న సీఎం.. విజయనగరం రూరల్‌ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్దిదారుల కోసం సిద్ధం చేసిన భారీ లే అవుట్‌ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తంగా 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం, వైసీపీ వేడుకలా నిర్వహించనుండగా, ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో చోటుచేసుకున్న ఘటనతో జిల్లాలో టెన్షన్ పెరిగింది. రామతీర్థం ఘటనపై రాజకీయ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 పథకం ప్రకారమే ధ్వంసం..

పథకం ప్రకారమే ధ్వంసం..

విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై కోదండరాముడి విగ్రహం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని, ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతర్వేది, బిట్రగుంట ఆలయాల్లో రథాలకు నిప్పు పెట్టినప్పుడే బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావన్నారు. జగన్ పాలనలో మనుషులకే కాదు, దేవాలయాలకు, దేవతా విగ్రహాలకు కూడా భద్రత లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘటనపై..

జీసస్ విగ్రహం తల నరికితే..

జీసస్ విగ్రహం తల నరికితే..

రామతీర్థం ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడంలేదా? అదే, జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే క్షణాల్లో పట్టుకుంటారు. హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నేరస్తులను పట్టుకోవడం లేదు. సీఎంకు హిందువులంటే అంత చులకనా? హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని తక్షణం పట్టుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వంలో వరుస సంఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి దయచేసి కఠిన చర్యలు తీసుకోండి'' అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్‌డౌన్ నష్టాన్ని భరిస్తూ..

English summary
hours before the arrival of the Chief minister YS Jagan to Vizianagaram district, tension prevailed at Ramateertham village as some miscreants have vandalized the 400 years old Kodanda Rama temple. ysrcp mp raghuramakrishnam raju, tdp chief chandrababu slams cm jagan and ysrcp govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X