అమరావతికి భూమివ్వలేదని అరటి తోట ధ్వంసం: బాబు సీరియస్! వేటు

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగులో భూములు ఇవ్వలేదని సీఆర్డీఏ అధికారులు ఓ రైతు పొలం దున్నించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది.

తుళ్లూరు మండలం లింగాయపాలెంలో రాజేష్ అనే రైతు ఉన్నారు. అతను ఏడు ఎకరాల మూడు సెంట్లలో అరటి తోట వేసుకున్నాడు. ల్యాండ్ పూలింగులో అతను ప్రభుత్వానికి భూమి ఇవ్వలేదు. అయితే, గురువారం అతని అరటి తోటలు ధ్వంసం అయ్యాయి.

Amaravati

సీఆర్డీఏ అధికారులు అతని అరటి తోటలను దున్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రైతు రాజేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రభుత్వం అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. భూమి ఇవ్వకుంటే తోటలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని తెలుస్తోంది.

రాజేష్ ఫిర్యాదుతో వీఆర్ఏ, వీఆర్వో, సూపర్ వైజర్‌ల పైన వేటు వేశారు. రైతు అరటి తోట ధ్వంసం చేయడంతో.. తోటతో పాటు మూడు బోర్లు, డ్రిప్ పైప్ లైన్లు కూడా ధ్వంసమయ్యాయి.

ఏపీ రాజధాని అమరావతి కోసం చాలామంది రైతులు భూములు ఇచ్చారు. భూములు ఇవ్వని రైతులు... కోర్టుకు వెళ్లగా, వారు వ్యవసాయం చేసుకోవచ్చునని తెలిపింది. వ్యవసాయం కాకుండా అమ్మకాలు జరిపితే మాత్రం వారు ప్రభుత్వానికే ఇవ్వవలసి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+