వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్‌ పవన్ కళ్యాణ్‌‌-మెడమీద తలకాయలుండవ్‌- పిచ్చికుక్కల్ని పట్టించుకోం

ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో వైసీపీ, జనసేన మధ్య వివాదంగా ఇది మారిపోయింది. వీరవాసరం మండలం మత్సపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి ఆరోపించగా.. వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్భలంతో పోలీసులు ఎస్సీలైన తమ కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలతో వీరు చేసుకున్న కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.

మత్సపురిలో అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ

మత్సపురిలో అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ


పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వీరవాసరం మండలం మత్సపురిలో అంబేద్కర్ విగ్రహానికి కొందరు చెప్పుల దండ వేశారు. దీన్ని నిరసిస్తూ స్ధానిక దళితులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. వీరికీ స్ధానికంగా ఉన్న జనసేన కార్యకర్తలకూ మధ్య వార్‌ మొదలైంది. దీంతో స్ధానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ రంగంలోకి దిగారు. దళితులకు మద్దతుగా మత్సపురికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆయనపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంద. దీంతో ఈ వ్యవహారం వైసీపీ వర్సెస్‌ జనసేనగా మారిపోయింది.

 పవన్‌ కళ్యాణ్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే గ్రంధి

పవన్‌ కళ్యాణ్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే గ్రంధి

మత్సపురి ఘటనలో బాధితులను పరామర్శించేందుకు తాను వెళ్తుంటే జనసేన కార్యకర్తలు అడ్డుకోవడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహకశక్తులుగా మారి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు దళితులపై దాడులు చేశారని, ఇది తెలిసి అక్కడికి వెళ్లిన తనపైనా దాడికి వారు ప్రయత్నించారని గ్రంధి ఆరోపించారు. అంతటితో ఆగకుండా దాడులను ప్రోత్సహిస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మెడ మీద తలకాయలుండవంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీ కార్యకర్తలకు ఏం దిశా నిర్దేశం చేస్తున్నారంటూ రెచ్చిపోయారు. దళితులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకపోతే ఛలో మత్సపురికి పిలుపునిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.

 వైసీపీ ఎమ్మెల్యేను కుక్కతో పోల్చిన పవన్‌

వైసీపీ ఎమ్మెల్యేను కుక్కతో పోల్చిన పవన్‌

తనను ఉద్దేశించి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. గ్రంధి మాటల్ని జనసేన నేతలు పట్టించుకోవద్దని సూచించారు. అంతటితో ఆగకుండా వీధిలో కుక్కలు అరుస్తాయి. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన వాటిని మనం కరవం కదా అంటూ జనసేన కార్యకర్తలకు పవన్ హితబోధ చేశారు. మున్సిపాల్టీ వాళ్లకు ఫోన్ చేస్తాం, వ్యాన్‌ వచ్చే వరకూ ఆగుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకూ సంయమనం పాటించాలన్నారు. గ్రంధి శ్రీనివాస్ ఆకురౌడీ అని బ్యాంకులను దోచేసిన దొంగ అని పవన్‌ పరుష పదజాలంతో విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+