హోదా: రాజ్యసభలో సుజనా చౌదరి వర్సెస్ పీయూష్ గోయెల్
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, మాజీ కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరిల మధ్య శుక్రవారం వాగ్వాదం చోటు చేసుకుంది.
ప్రత్యేక హోదా అంశంపై మాట ఎందుకు మార్చాలని సుజన నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

మరోవైపు, హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో ఆరోపించారు. చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు.
కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన తమ ఎంపీలు అయిదుగురే అయినప్పటికీ ఐదు కోట్లమంది ప్రజల ఆకాంక్షను తమ పార్టీ వినిపించిందన్నారు. లోకసభ జరిగినంత కాలం అవిశ్వాసతీర్మానానికి నోటీసులు ఇస్తూనే ఉంటామన్నారు. చివరి రోజున ఎంపీలందరూ రాజీనామా చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications