వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ లేఖలతోనే డెసిషన్ మారిందా: సీఎం కోరిందే పీఎం మోదీ చేశారా: ప్రధాని తాజా నిర్ణయం వెనుక..!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసారు. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రానిదే అంటూ ప్రకటించారు. కేంద్రం పరిధిలోనే వ్యాక్సినేషన్ జరుగుతుందని స్పష్టం చేసారు. దేశమంతా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు. వ్యాక్సినేషన్ విధానంలో తాము సాధించిన విజయాలను చెబుతూనే...ఒక రకంగా ప్రధాని గత నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనక ఏపీ సీఎం జగన్ లేఖాస్త్రం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పలువురు సీఎంల లేఖలు

పలువురు సీఎంల లేఖలు

మే 1వ తేదీ నుండి 18 ఏళ్ల వయసు దాటిన వారికి వ్యాక్సినేషన్ పైన కేంద్రం నిర్ణయం తీసుకున్నా..ఏ రాష్ట్రం అమలు చేయలేదు. ఇదే సమయంలో పలువురు ముఖ్యమంత్రులు...నిపుణులు కేంద్ర వ్యాక్సినేషన్ విధానాన్ని తప్పు బట్టారు. సుప్రీంకోర్టులో సైతం దీని పైన విచారణ జరిగింది. బడ్జెట్ లో వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన 35 వేల కోట్లు ఏమయ్యాయని న్యాయస్థానం నిలదీసింది. అయితే, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్రం నేరుగా న్యాయస్థానాన్ని కోరింది. ఇదే సమయంలో కేరళ..ఒడిశా..ఏపీ ముఖ్యమంత్రులు లేఖలు రాసారు. ఇతర ముఖ్యమంత్రులు సైతం కేంద్రమే వ్యాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని కోరినా పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు.

జగన్ లేఖతో కదిలిందా..?

జగన్ లేఖతో కదిలిందా..?


అయితే నాన్ ఎన్డీఏ..నాన్ యూపీఏ ముఖ్యమంత్రులుగా ఉన్న నవీన్ పట్నాయక్...జగన్ వంటి వారు సైతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసారు. ప్రధానంగా అటు లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీ గా..రాజ్యసభలో కేంద్రానికి అన్ని వేళల మద్దతిచ్చే న్యూట్రల్ పార్టీగా వైసీపీ ఉంది. ఏపీకి కేంద్రం నుండి వ్యాక్సినేషన్ల విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా కేటాయింపులు జరిగాయని ప్రభుత్వంలోని ముఖ్యులు చెప్పుకొచ్చారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ తన లేఖలో కేంద్రమే వ్యాక్సినేషన్ పంపిణీ పై బాధ్యత తీసుకోవాలని..ఈ విషయంలో అందరు సీఎంలు ఒకే వాయిస్ వినిపించాలని జగన్ కోరారు. రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా..కేంద్ర షరతుల కారణంగా టెండర్లు దాఖలు కావటం లేదని లేఖలో పేర్కొన్నారు. అప్పటికే ఏపీ సీఎం నేరుగా ప్రధానికి వ్యాక్సినేషన్ గురించి లేఖలు రాసారు.

 రాజకీయంగా చర్చ

రాజకీయంగా చర్చ

ఇక, ప్రధాని తన ప్రసంగంలోనూ ముఖ్యమంత్రులు పలువురు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని... ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలకు ఈ భారం నుండి విముక్తి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రాలకు రూపాయి ఖర్చు లేకుండా కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని ప్రధాని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు జగన్ లాంటి ముఖ్యమంత్రులు కోరుకున్నదీ ఇదే...ప్రధాని చేసింది ఇదే. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని పైన చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఈ సమయంలో విమర్శలు సరి కాదని..మోదీకి మద్దతుగా నిలవాలని సూచించారు. దీని పైన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. అదే సీఎం జగన్...తాజాగా కేంద్రమే టీకాల విషయంలో బాధ్యత తీసుకోవాలని..ముఖ్యమంత్రులకు లేఖలు రాయటం పైన రాజకీయంగా డిస్కషన్లు జరిగాయి. ఇక, ఇప్పుడు ప్రధాని నిర్ణయం తరువాత సీపీఐ సీనియర్ నేత నారాయణ లాంటి వారు సైతం ఈ లేఖల ప్రభావమే మోదీ నిర్ణయానికి కారణమంటూ వ్యాఖ్యానించారు.

English summary
There is a political debate going on over PM Modi's announcement on vaccine that this statement came after CM Jagan had written a letter to all state CMs to maintain one voice over vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X