Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ వాసులకు వేస్ట్ టు వండర్ ఛాలెంజ్.. ఏకంగా రూ.22.5లక్షల నగదు బహుమతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త నుండి సంపదను సృష్టించే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జరుగుతుంది. ఏపీని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్- స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం పని చేస్తుంది. ఈ క్రమంలోనే గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ నగరవాసులకు చెత్త రహిత నగరాన్ని నిర్మాణం చేయడం కోసం వేస్ట్ టు వండర్ ఛాలెంజ్ ప్రకటించింది. ఈ ఛాలెంజ్ ద్వారా మొత్తం 22.5 లక్షల నగదు బహుమతులను విజేతలకు అందించనుంది.

ఇనుముతో కళాఖండాలు సృష్టించి నగరానికి కొత్త అందాలు

జీవీఎంసీ 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26'లో భాగంగా పాత ఇనుముతో కళాఖండాలు సృష్టించి నగరానికి కొత్త అందాలు తీసుకురావాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈ పోటీల్లో నగరంలోని వెల్డింగ్ షాపులు, మెటల్ ఆర్టిస్టులు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు పాల్గొనవచ్చు. వ్యర్థ ఇనుము, ఇతర పనికిరాని వస్తువులతో 4 నుండి 8 అడుగుల ఎత్తులో కళాకృతులను సృష్టించాలి. వీటిలో 80 శాతం ఇనుమే ఉండాలి అని పేర్కొంది.

waste to wonder challenge in visakhapatnam 22 5 lakhs prizes hurry up for the championship applications

వేస్ట్ టు వండర్ ఛాలెంజ్ లో రూ.22.5 లక్షల నగదు బహుమతులు

ఈ చాలెంజ్ లో పాల్గొనే వారి కోసం విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను కూడా జీవీఎంసీ ప్రకటించింది. ప్రతి జోన్‌లో తొలి బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి 50వేల రూపాయలు, మూడో బహుమతి 25 వేల రూపాయలు. అదనంగా, పది మందికి ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మొత్తం రూ.22.5 లక్షల నగదు బహుమతులు అందజేయనుంది.

విజేతల కళాఖండాలను నగరంలో ఏర్పాటు

ఈ వేస్ట్ టు వండర్ ఛాలెంజ్లో పాల్గొన్న అందరికీ జీవీఎంసీ నుండి సర్టిఫికెట్లు అందజేయనుంది. ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న విజేతల కళాఖండాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తారు. వాటి పక్కన సృష్టికర్తల పేర్లను, షాపుల వివరాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం కావడంతో, వేస్ట్ టు వండర్స్ చేయగలిగిన వారు పాల్గొనాలని సూచిస్తోంది.

సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే!
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే!

ఛాలెంజ్ లో పాల్గొనటం కోసం దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఇదే

ఆసక్తి ఉన్నవారు తమకు దగ్గరలోని స్వర్ణ వార్డు సచివాలయంలోని శానిటరీ సెక్రటరీని సంప్రదించి నమోదు చేసుకోవాలని జివిఎంసి పేర్కొంది. ఇందులో పాల్గొనాలి దలచిన వారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10 చివరి తేదీ కాగా, గడువు ముగియడానికి మరో 4రోజులే ఉన్న కారణంగా, ఆసక్తి ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ సూచించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+