పవన్ కళ్యాణ్ పార్టీని పట్టించుకోవడం లేదు:కడియం

మూడు రోజుల్లో ముసాయిదా ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తామని చెప్పారు. ఈ నెల 17వ తేదీన మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. పార్టీ మేనిఫెస్ట్ కోమటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళిక ఉండాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు మెయిల్ అడ్రస్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో కూడా సజెషన్స్ బాక్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలవారీగా సమస్యలను తెలిపి, సూచనలు చేయవచ్చునని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాలనుకుంటున్న విషయంపై తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే విరుచుకుపడ్డారు. ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలోకి రావాలని ఆమె అన్నారు. తమ ప్రాంత ప్రజలను చిరంజీవి మోసం చేశారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications