జగన్ పార్టీని వీడేది లేదు, తోక మీడియా దుష్ప్రచారం: తేల్చిన ఆ ఎమ్మెల్యేలు
తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు.
కర్నూలు: తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు.

మైండ్ గేమ్..
కొన్ని టీవీ ఛానళ్లు మైండ్ గేమ్ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైయస్సార్ కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. టీవీ ఛానళ్లు అసత్య ప్రచారాలు మానుకొని నిజానిజాలు చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు.
Recommended Video


వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే..
వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తాను మారోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమ తోక పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

జగన్ వెంటే..
ఇది ఇలావుండగా, తమ పార్టీ అధినేత జగన్ వెంటే తాను ఉంటానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మూడేళ్లుగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, అవమానాల్ని ఎదుర్కొంటూ వస్తున్నామని చెప్పారు.

వార్తల నేపథ్యంలో..
కన్నతల్లి లాంటి వైసీపీని వీడేదిలేదని మరోసారి తేల్చి చెప్పారు. వైసీపీకి చెందిన ఐదుగురు నేతలు టీడీపీలో చేరుతున్నట్లు గురువారం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పష్టతనిచ్చారు.












Click it and Unblock the Notifications