చంద్రబాబు రాష్ట్రపతిని కలుస్తారు: విభజనపై నామా

ఇరుప్రాంతాల ప్రయోజనాలు కాపాడే విధంగా ముసాయిదా బిల్లు ఉండాలని కోరుతున్నట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు. బిల్లును ఏ రూపంలో తీసుకువస్తారో చూసి పార్టీలో మరోసారి చర్చ జరుపుతామని ఆయన వెల్లడించారు.
ఫిబ్రవరి 3 లేదా 4వ తేదీన చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆయన తెలిపారు. సమన్యాయ విధానాన్నే పార్లమెంటులో కూడా కొనసాగిస్తామని నామా అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునని నామా నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా పార్టీల నేతలు విడిపోయారని అన్నారు. రాష్ట్రంలో వరుస తుపాను గురైన బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని పార్లమెంటు పట్టుపడతామని చెప్పారు. నల్లధనాన్ని భారత్‌కు తీసుకోవాల్సిన అవసరం ఉందని నామా నాగేశ్వరరావు అన్నారు.












Click it and Unblock the Notifications