కొత్త రాష్ట్రం అండగా ఉండండి, బడ్జెట్‌లోగా బకాయిలు: ఈటెల
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆర్ధిక సమావేశానికి ఆయన హాజరయ్యారు.
అనంతరం మంత్రి ఈటెల విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల అవసరార్థం బియ్యం మరింత పెంచాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. దేశంలో గొప్పగా నడిచే వసతిగృహాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, జనవరి 1నుంచి రాష్ట్రంలోని వసతి గృహాలకు సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు.

కొత్త రాష్ట్రం కాబట్టి, రాష్ర్టానికి రావాల్సిన బకాయిలను బడ్జెట్‌లోగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సమస్యలపై ప్లానింగ్ కమిషన్‌కు వివరించామని పేర్కొన్నారు.
కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్‌తో మంత్రి ఈటెల భేటీ
కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్రకుమార్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ వినోద్‌తోపాటు డిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications