రాజధాని, పిపిఏపై చంద్రబాబు, ఆర్బీఐతో 'కోటయ్య' భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాజధాని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గల పీపీఏల వివాదం అంశం పైన స్పందించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్ పైన కూడా ఆయన వ్యాఖ్యానించారు.
పోలవరం ఆర్డినెన్స్ చట్టం పైన కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పీపీఏల రద్దు విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించని పీపీఏల ఒప్పందాలనే తాము రద్దు చేశామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

రాజధాని విషయంలో తాము అందరి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. రాజధాని ఎక్కడ ఉన్నప్పటికీ.. అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హామీ ప్రదేశ్‌గా మారుస్తామని ఆయన చెప్పారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనే తమ లక్ష్యమన్నారు.
ఆర్బీఐ గవర్నర్‌తో కోటయ్య కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణమాఫీ రద్దు విషయమై విధి విధానాలను చర్చించేందుకు కోటయ్య కమిటీ ముంబైలో ఆర్బీఐ గవర్నర్‌ను కలిసింది. ఆర్బీఐ గవర్నర్‌తో గంటకు పైగా భేటీ అయిన కోటయ్య కమిటీ మాఫీ విధి విధానాల పైన చర్చించింది.












Click it and Unblock the Notifications