అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్బ.!రోత.!కొడాలి నాని గొంతు వినలేకపోతున్నాం.!విసుగెత్తి పోతున్న జనాలు.!ఢిల్లీ బేస్డ్‌ వెబ్‌సైట్‌ తాజా సర్వే.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : మనం ఎంత తోపులమైన మనకన్నా తోపు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉంటాడు. మనకే అంతా తెలుసని విర్రవీగడం, పదే పదే ప్రసార మాద్యమాల ముందుకు రావడం, నియంత్రణ, వావి వరసలు, పెద్ద చిన్న విచక్షణ లేకుండా వాగితే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదనే సందర్బాలు అనేకం ఉన్నాయి. నరంలేని నాలుక కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే ఆ కాసేపు సంచలనం కావచ్చేమోగాని తర్వాత దాని ప్రభావం క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని గ్రహించకపోడం కూడా మూర్ఖత్వమే అవుతుంది.

 అబాసుపాలవుతున్న నేతలు..

అబాసుపాలవుతున్న నేతలు..

ఒక్క సారి ప్రజా జీవతంలోకి వచ్చిన తర్వాత నియంత్రణ అనేది ఉండకపోతే ఎంత అబాసువాలవుతారో ఇటీవల అనేక ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రసార మాద్యమాల్లో మాట్లేడేటప్పుడు భాష, వేశం, మాట తీరు సరిగా లేక పోతే రాజకీయ నాయకులకు మరీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఆ ఏముందిలే తన ఇంటర్య్వూను వంద మంది కూడా చూడలేదు, ఎవరు పట్టించుకుంటారు అనే నిర్లక్ష్యం ఒక్కోసారి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని కొంత మంది రాజకీయ నాయకుల గురించి, టీవీల్లో హాస్యానికి సంబందించిన కార్యక్రమాల గురించి ఢిల్లీ కి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

 ప్రజల స్పందన అనూహ్యం..

ప్రజల స్పందన అనూహ్యం..

అదే సంస్థ గతంలో జనాలకు బాగా వినోదాన్ని అందిస్తున్న రాజకీయ నాయకులు ఎవరు.? బాగా విసుగెత్తిస్తున్న రాజకీయ నాయకులు లేదా ప్రజా ప్రతినిధులు ఎవరు అనే అంశం మీద సర్వే నిర్వహించి కొందరి రాజకీయ నేతల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించింది. 2016లో ఢిల్లీ బేస్డ్‌ వెబ్‌సైట్‌ నిర్వహించిన సర్వే ఆసక్తికరంగా ఉండడంతో పాటు వాస్తవంగా ఉందని చాలా మంది నెటిజన్లు స్పందించారు. తాజాగా అదే సంస్ధ మరో ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాలు, టీవీషోల గురించి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

గతంలో సర్వే చేసిన వెబ్‌సైట్‌..

గతంలో సర్వే చేసిన వెబ్‌సైట్‌..

ఢిల్లీ బేస్డ్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధులు రాష్ట్రాల వారీగా ఒక సర్వే నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే యూనిట్‌గా తీసుకుని వారీ అధ్యయనం చేసినట్టు సమాచారం. మూడేళ్ల క్రితం ఇదే సంస్థ మోస్ట్ అడ్మైరింగ్ ప్రామినెంట్ పీపుల్ అనే సర్వేను కూడా చేసినట్టు సమాచారం. అప్పుడు వినూత్నంగా ప్రజలు ఎక్కువ ఎవరని చూడగానే ఇరిటేషన్‌ పొందుతారు అనే అంశాన్ని తీసుకున్నారు. తెలుగునాట వారు ఆరుగురికి తమ ర్యాంకింగ్ లలో ఎక్కువ పాయింట్లు ఇచ్చారు.టీవీల్లో ఎక్కువ కనిపించే వ్యక్తులపైనే వారు అభిప్రాయాలు తీసుకోగా చాలామంది ప్రముఖులు వెనక్కిపోగా, ఈ ఆరుగురికి మాత్రం ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి.

అమ్మో.. వారి గొంతులు వినలేం బాబు..

అమ్మో.. వారి గొంతులు వినలేం బాబు..

మూడేళ్ల క్రితం తెలుగు వారిని ఎవరు ఎక్కువగా విసిగించారు అన్న ప్రశ్నకు ఆరుగురి పేర్లను ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అందులో 1.లక్ష్మీపార్వతి.2.రోజా, 3.అంబటి రాంబాబు, 4.కొమ్మినేని, 5.ప్రముఖ ఛానల్ రిపోర్టర్ జాఫర్, 6.గోనే ప్రకాశరావు. అందులో రిపోర్టర్‌ తప్ప మిగతా వారు అందరూ సీఎం వైఎస్‌ జగన్‌కు సన్నిహితులు కావడం విశేషం. మాజీ ఎమ్మెల్యే, టీవీ విశ్లేషకులు గోనే ప్రకాశరావు గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక అదే సంస్థ తాజాగా జరిపిన సర్వేలో ఏపి మంత్రి కొడాలి నానిది మోస్ట్ ఇరిటేటింగ్ వాయిస్ అని, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణంలేకుడా కోపాన్ని ప్రదర్శించే మంత్రిగా ఎక్కువ ర్యాంకింగ్ వచ్చినట్టు నిర్ధారించింది.

English summary
Representatives of the Delhi-based website conducted a state-wise survey. Information that the two Telugu states were studied as a single unit. Three years ago, the same company conducted a survey called Most Admiring Prominent People.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X