వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణలపై జైట్లీ, రాజధాని 'రియల్' రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం అన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

బాబు, కేసీఆర్‌లకు రఘువీరా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన హితవు పలికారు. రీయింబర్సుమెంట్స్, ఎంసెట్‌ల పైన రెండు ప్రభుత్వాలు భేషజాలకు పోవద్దన్నారు.

We committed to AP and T development: Jaitley

ముఖ్యమంత్రిలు ఇరువురు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆగస్టు చివరికల్లా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు వేస్తామని రఘువీరా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సన్నిహితులు రియల్ ఎస్ట్టే వ్యాపారానికి తెర దీయడం సరికాదన్నారు.

ఎత్తివేయాలనే: కేసీఆర్ పైన సుధీష్ రాంబొట్ల

ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఎత్తివేయాలని కేసీఆర్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 1956కు ముందు పుట్టింది ఖాసీం రజ్వీ వారసులైన రజాకార్లే, వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందనా అని ఆయన ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై కోర్టును ఆశ్రయిస్తామని సుధీష్ రాంబొట్ల తెలిపారు.

English summary
We committed to Andhra Pradesh and Telangana development, says Arun Jaitley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X