మాట మార్చలేదు: బాబు, సమస్య చెప్పాం: పురంధేశ్వరి

సమన్యాయం పేరుతో 2008లోనే సూత్రప్రాయంగా తెలంగాణకు అంగీకరించామన్నారు. 2008 నుంచి తాము మాట మార్చలేదని చెప్పారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల ఐక్యకార్యాచరణ సమితిలతో చర్చించాలన్న తమ డిమాండుకు కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.
విభజన ప్రకటన చేస్తారని నాలుగు రోజుల ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కాంగ్రెసులో కలుస్తుందని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని, రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దత్తపుత్రుడు జగన్, అద్దె పుత్రుడు కెసిఆర్, పనికిరాని పుత్రుడు కిరణ్ అని ఎద్దేవా చేశారు.
రాజీనామాలపై చర్చించలేదు: పురంధేశ్వరి
మరోవైపు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అనంతరం కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రధాని సమావేశంలో రాజీనామాల అంశం చర్చకు రాలేదన్నారు. సీమాంధ్ర సమస్యలను తాము మరోసారి ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. హైదరాబాదు, జలవనరులు, ఉద్యోగ అంశాలను తాము ఆయనకు వివరించామన్నారు. బిల్లు ఎప్పుడు వస్తుందనే విషయమై చర్చ జరగలేదన్నారు. అందరికీ న్యాయం, ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 నుండి 20వ తేదీ వరకు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications