రాయల తెలంగాణ ప్రతిపాదన ఉన్మాద చర్య : బైరెడ్డి

 Byreddy Rajasekhar Reddy
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము ఒప్పుకునే ప్రసక్తేలేదని, ఈ ప్రతిపాదన ఓ ఉన్మాద చర్య అని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయల తెలంగాణ అంటే తెలంగాణ వెనక్కి పోయినట్లేనని అన్నారు. రాయల తెలంగాణను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిలు ఎందుకు ఖండించడం లేదని బైరెడ్డి ప్రశ్నించారు.

రాయల తెలంగాణను అడ్డుకునేందుకు నవంబర్ 27, 28 తేదీల్లో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కోర్టుకు వెళ్లైనా అడ్డుకుంటామన్నారు. ఆర్టికల్ 371 (డి)ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని బైరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే సీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాలని చెబుతూ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. తమ ప్రాంత నాయకులే ఎంఐఎం నేత అసదుద్దీన్ ద్వారా రాయల తెలంగాణ తతంగాన్ని నడుపుతున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. అలాంటి నాయకులను ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.

రాయల తెలంగాణకు అంగీకరించం : కేకే

రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవరావు స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 29ని దీక్షా దివస్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఆంక్షలు లేని తెలంగాణ వచ్చే వరకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+