చేతులు జోడిస్తే.. అరగంటలో ఇస్తానని బొత్స!(పిక్చర్స్)

హైదరాబాద్: సచివాలయంలో శుక్రవారం మంత్రుల సమావేశం అనంతరం వారు బయటకు వస్తున్న సమయంలో సీమాంధ్ర ఉద్యోగులు చేతులు జోడించి నమస్కారం పెట్టి నిరసన తెలిపారు. విభజన ప్రక్రియను ఆపేసాలా చర్యలు తీసుకోవాలని, సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయాలని వారు కోరారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణష మంత్రులు రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, శైలజానాథ్, కొండ్రు మురళి తదితరులకు నమస్కారాలు, మూగసైగలు, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

అయితే తాము కూడా సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నామంటూ మంత్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులతో బొత్స మాట్లాడుతూ...రాజీనామాల వల్ల ప్రయోజనం ఉండదని, తన రాజీనామాతోనే రాష్ట్ర విభజన ఆగుతుందని గ్యారంటీ ఇస్తే అర్ధ గంటలోనే రాజీనామా చేస్తానని చెప్పారు. విభజనపై ఎలా స్పందించాలో అలా స్పందిస్తామన్నారు.

మీరు తలచుకుంటే రాష్ట్ర విభజన ఆగుతుందని ఉద్యోగులు వ్యాఖ్యానించగా, తలచుకునేందుకే బాధలు పడుతున్నామని బొత్స జవాబిచ్చారు. ఇక అవసరమైతే అందరం కలిసి రాజీనామాలు చేస్తామని మరో మంత్రి పేర్కొన్నారు. తనకు రోజుకో మాట మాట్లాడటం చేతకాదని మంత్రి శైలజానాథ్ చెప్పారు.

మంత్రులను అడ్డుకుంటున్న ఉద్యోగులు

మంత్రులను అడ్డుకుంటున్న ఉద్యోగులు

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని, రాష్ట్ర విభజన జరకుండా కాపాడాలని చేతులు జోడించి కోరుతున్న ఓ సీమాంధ్ర ఉద్యోగి.

తెలంగాణ మంత్రులు

తెలంగాణ మంత్రులు

శుక్రవారం కేబినెట్ సమావేశం అనంతరం సచివాలయం నుండి బయటకు వస్తున్న తెలంగాణ మంత్రులు బస్వరాజు సారయ్య, శ్రీధర్ బాబు, జానా రెడ్డి తదితరులు.

వట్టితో జానా

వట్టితో జానా

కేబినెట్ సమావేశానికి ముందు సీమాంధ్ర మంత్రి వట్టి వసంత్ కుమార్‌తో మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత మంత్రి కుందూరి జానా రెడ్డి.

మంత్రికి అడ్డు

మంత్రికి అడ్డు

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని, రాష్ట్ర విభజన జరకుండా కాపాడాలని మంత్రికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు.

వట్టి సమాధానం

వట్టి సమాధానం

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని సచివాలయ ఉద్యోగులు అడ్డుకొని విజ్ఞప్తి చేయడంతో మంత్రి వట్టి వసంత్ కుమార్ కారు నుండి దిగి సమాధానపరుస్తున్న దృశ్యం.

అందరి నమస్కారం

అందరి నమస్కారం

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని, రాష్ట్ర విభజన జరకుండా కాపాడాలని మంత్రులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు.

అరగంటలో రాజీనామా చేస్తా

అరగంటలో రాజీనామా చేస్తా

రాజీనామా చేయాలని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు తనను అడ్డుకోవడంతో తన రాజీనామాతో విభజన ఆగుతుందంటే అరగంటలో చేస్తానని చెబుతున్న పిసిసి చీఫ్ బొత్స.

రఘువీరా రెడ్డి

రఘువీరా రెడ్డి

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని, రాష్ట్ర విభజన జరకుండా కాపాడాలని రఘువీరా రెడ్డిని చేతులు జోడించి కోరుతున్న ఓ సీమాంధ్ర ఉద్యోగి.

శైలజానాథ్

శైలజానాథ్

శుక్రవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం శైలజానాథ్ బయటకు వెళ్తుండగా జోలెపట్టి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరుతున్న మహిళా ఉద్యోగి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+