అర్హత లేదు, టిని అడ్డుకుంటాం: అధిష్టానంపై కాసు
గుంటూరు/హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించే అర్హత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు లేదని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలోని స్వయం సహాయక గ్రూపులకు రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తామని స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటే ఉంటూ రాష్ట్ర సమైక్యత కోసం పోరాడుతామని కాసు వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించడం ఎవరితరం కాదని, అసెంబ్లీలో తమ వాదనను వినిపించి విభజన ప్రక్రియను అడ్డుకుంటామని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి అనాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఎదురొడ్డి విభజనను అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆయన బాటలోనే తాను కూడా నడుస్తానని, రాష్ట్ర సమైక్యతను కాపాడుతానని చెప్పారు.

తెలంగాణ బిల్లును ఓడిస్తాం: ఆనం
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని హైకమాండ్ కోరిందని చెప్పారు. మా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెబుతామని, ఓటింగ్ ఉంటే తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడిస్తామని ఆనం స్పష్టం చేశారు.
మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పు సహజమైన చర్యేనని, ఏదో అవుతుందని అనడం సరికాదని ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు మొన్నటి వరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విధేయుడని, అన్ని అధిష్టానానికి చెప్పే చేస్తున్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications