రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా సామాజిక వర్గం నేత సీఎం అయితే ఓకే - వైసీపీ కాపు నేతల కొత్త నినాదం..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రానున్న ఎన్నికల్లో కాపు వర్గం ఎవరికి మద్దతుగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేస్తారా. వైసీపీకి ఓట్లు వేయకుండా ప్రభావితం చేయగలరా. ఇప్పుడు వైసీపీ కాపు నేతల సమావేశంతో అనేక అంశాలు చర్చకు కారణమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అధిక శాతం ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా పోలైందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైనా వైసీపీనీ ఓడిస్తామని చెబుతూ..తెర మీదకు తీసుకొస్తున్న సామాజిక సమీకరణాలతో వైసీపీ అలర్ట్ అయింది.

పవన్ - చంద్రబాబు పొత్తుపై ఎఫెక్ఠ్
వైసీపీ కాపు వర్గ నేతలు రాజమండ్రిలో సమావేశమయ్యారు. కొద్ది రోజుల క్రితం బీసీ వర్గానికి చెందిన వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కాపు వర్గానికి మంత్రివర్గం నుంచి క్షేత్ర స్థాయి వరకు పదవుల పరంగా లభించిన ప్రాధాన్యత..ప్రభుత్వ పథకాలతో జరిగిన మేలు గురించి వివరంగా కాపు సామాజిక వర్గం లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. సీఎం జగన్ తన సామాజిక వర్గం నుంచి ఎంత మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారో..అదే సంఖ్యలో కాపు వర్గానికి అవకాశం ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో కొత్త నినాదంతో పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టేందుకు వైసీపీ కాపు నేతలు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా కాపు వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తాము సంతోషిస్తామని చెబుతున్నారు.

We want CM from our community, but Pawan Kalyan has interest on Chandrababu- YCP Kapu community leaders

వైసీపీ కాపు నేతల కొత్త ప్రచారాస్త్రం
కానీ, పవన్ కళ్యాణ్ మరో నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దమవుతున్నారంటూ జనసేనానిని ఆత్మరక్షణలో పడేసే వ్యూహం తెర మీదకు తీసుకొస్తున్నారు. కాపుల ఓట్లును హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు పవన్ సిద్దమయ్యారంటూ కొద్ది రోజుల క్రితం కాకినాడ సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే నినాదం బలంగా కాపు వర్గంలోకి తీసుకెళ్లాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే, ఆ రెండు పార్టీలకు చెందిన అధినేతలను రాజకీయంగా - సామాజిక వర్గాల మద్దతు దూరం చేసేలా కొత్త లెక్కలు సిద్దం చేస్తున్నారు. అటు సంక్షేమ పథకాలతో పాటుగా తాము అమలు చేస్తున్న సామాజిక న్యాయం తమకు మరోసారి అధికారం కట్టబెడుతుందనే ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారు.

We want CM from our community, but Pawan Kalyan has interest on Chandrababu- YCP Kapu community leaders

ద్విముఖ వ్యూహంతో వైసీపీ అడుగులు
కానీ, అదే సమయంలో ఏ వర్గం తమ నుంచి దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను కాపు ఓట్ బ్యాక్ ప్రభావితం చేయనుంది. దీంతో, అదే జిల్లాల వేదికగా వైసీపీ నేతలు తాజాగా సమావేశం అయ్యారు. అక్కడ నుంచే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసేందుకు సహకారం అందిస్తున్నారంటూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు వైసీపీ కాపు నేతల తాజా నినాదం పైన జనసేన స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
YSRCP Kapu community leaders moving with new strategy to counter Pawan Kalyan for up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X