విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డైనమిక్ సిటీగా విశాఖ: చంద్రబాబు, విరాళాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుధుద్ తుఫాను తాకిడికి దెబ్బతిన్న విశాఖపట్నంను డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సోమవారం విశాఖ తుఫాను పునరుద్ధరణ పనులపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ఇలాంటి తుఫానులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేలా విశాఖను తయారు చేస్తామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీతో టౌన్‌షిప్‍లు నిర్మిస్తామని చెప్పారు.

రైతులు, తుఫాను బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కార్యక్రమాలు చేపడుతామన్నారు. తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు తెలిపారు. 6.75 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు కొన్ని ప్రాంతాలను దత్తత ఇస్తామని తెలిపారు. కార్పొరేట్, ప్రభుత్వం సుంయుక్త భాగస్వామ్యంలో కాలనీలను పునర్నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.

అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసి, సహకరించాలని కోరతామని చెప్పారు. తుఫాను నష్టం అంచనా వేసేందుకు నాలుగు బృందాలను పనిచేస్తున్నాయని చెప్పారు. విశాఖ వాసులు దీపావళి పండగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. అయితే బాణాసంచా మాత్రం కాల్చొద్దని, వాటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

వ్యవసాయ రుణమాఫీపై సమీక్ష జరిపామని చెప్పారు. విజయవాడలో మంగళవారం రైతు సాధికార సంస్థ కార్యాలయ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రూ. 5వేల కోట్లతో సాధికార సంస్థ ప్రారంభమవుతుందని చెప్పారు. రైతుల రుణ విముక్తి కోసం సంస్థ పనిచేస్తుందని తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూరుస్తుందని తెలిపారు. రూ. 1.50లక్షల మేర రుణ మాఫీని చేస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

హుధుద్ తుఫాను తాకిడికి దెబ్బతిన్న విశాఖపట్నంను డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తుఫాను బాధితుల సహాయార్థం సిఎం చంద్రబాబు నాయుడుకు రూ. 6లక్షల చెక్కును అందిస్తున్న రత్నం స్కూల్స్ డైరెక్టర్, కరస్పాండెంట్ డాక్టర్ కె. కృష్ణ కిషోర్.

చంద్రబాబు

చంద్రబాబు

ఆయన సోమవారం విశాఖ తుఫాను పునరుద్ధరణ పనులపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

రైతులు, తుఫాను బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కార్యక్రమాలు చేపడుతామన్నారు. తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

6.75 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

కార్పొరేట్ సంస్థలకు కొన్ని ప్రాంతాలను దత్తత ఇస్తామని తెలిపారు. కార్పొరేట్, ప్రభుత్వం సుంయుక్త భాగస్వామ్యంలో కాలనీలను పునర్నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

హుధుద్ తుఫాను రిలీఫ్ ఫండ్‌కు రూ. 5లక్షలను సిఎం చంద్రబాబుకు అందజేస్తున్న ఎన్టీఆర్ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎన్ఎస్ ప్రసాద్, కుటుంబసభ్యులు.

రైతులకు రుణాలు అందిస్తామని చెప్పారు. బ్యాంకుల ద్వారా నేరుగా రైతులకే అందేలా చూస్తామని చెప్పారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కొందరు వ్యసాయం చేయకున్నా డబ్బులు తీసుకుంటున్నారు వారి వల్ల అసలైన రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు చైతన్య కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు

ప్రకృతి విపత్తుల పట్ల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 120ఏళ్ల నుంచి మనకు తుఫానులు వస్తున్నాయని, ఇవి కొత్తేమి కాదని చెప్పారు. ముందు జాగ్రత్త వల్లే పెను తుఫాను వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టాన్ని భారీగా తగ్గించామని చెప్పారు. ప్రకృతి విపత్తులపై అంతర్జాతీయ సంస్థలతో మాట్లాడతామని చెప్పారు.

ఎర్రచందనం, ఇసుక, బైరటీస్‌లపై కూడా సోమవారం సమీక్షించామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఖర్చు పెరుగుతోంది కాబట్టి, ఆదాయం పెంచుకోవాలని అన్నారు. ఇసుక విక్రయాలను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు.

మృతులకు చంద్రబాబు సంతాపం

తూర్పుగోదావరి జల్లాలోని వాకతిప్పలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాణాసంచా పేలుడు ఘటనలో 11మంది చనిపోయారని, అందులో 9మంది మహిళలు ఉన్నారని చెప్పారు. కర్మాగారం యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలినా, అనుమతి లేకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల సాయమందిస్తామని చెప్పారు. ఘటనపై విచారణకు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday said that they will develop Visakhapatnam as dynamic city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X