ఐదు శాతానికి ఒప్పుకోం, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సిందే: ముద్రగడ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు పెదవి విప్పారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాబోదన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించినంత మాత్రాన కాపులకు ఒరిగేదీమీ ఉండదని తేల్చి చెప్పారు.

తమ వెనక ప్రతిపక్ష నేత జగన్, మోడీ ఉన్నారనడం సరికాదని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయించడం మానుకోవాలని హితవు పలికారు. కాపుల రిజర్వేషన్‌ను తొమ్మిదో షెడ్యూలులో చేరిస్తేనే తమకు దీపావళి అని ముద్రగడ స్పష్టం చేశారు.

mudragada-padmanabham

ఏపీలో కాపులు కోటి మంది ఉంటే 50 లక్షల మందేనని పల్స్ సర్వేలో చూపించారని ముద్రగడ ఆరోపించారు. ముఖ్యమంత్రి తమకు భోజనం పెడతామని చెప్పి టిఫిన్ పెడుతున్నారని విమర్శించారు.

కాపులు పోరాడి రిజర్వేషన్ సాధించుకున్నారని, అయినా ఈ 5 శాతం రిజర్వేషన్‌కు తాము ఒప్పుకోమని ముద్రగడ పేర్కొన్నారు. ఇకనైనా తమపై ఆరోపణలు చేయించడం మానుకోవాలని ఆయన కోరారు. 

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At last Kapu Reservation aggitation leader Mudragada Padmanabham opened his mouth here in Vijayawada on Saturday evening and talked about 5 percent Reservation. He said that Kapu community will not agree for this much percent of reservations and also he demanded that Kapu Reservation should be included in Schedule Nine.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి