జాబితా సిద్ధమైందన్లే, జెసి బాధ అర్థం చేస్కోవాలి: బొత్స

ఇతర పార్టీలో చేరడానికి వీలుగా సొంత పార్టీపై విమర్శలు చేసే వారిపై చర్యలు తీసుకుంటానని తాను ఇటీవల చెప్పానే తప్ప జాబితా సిద్ధమైందని అనలేదన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారమే తాను ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పడంతో విమర్శలు చేసే వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నారు.
నవంబర్ 28వ తేదీ తర్వాత విమర్శలు చేసే వారిపైనే చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. వివిధ ఛానళ్ళలో వచ్చిన జాబితా ఇతర పార్టీలకు వెళ్ళాలనుకుంటున్న కర్చీఫ్ బ్యాచ్ అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే కర్చీఫ్ బ్యాచ్ కొంత ఇతర పార్టీలకు వెళ్ళిందని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోనియా గాంధీని విమర్శించలేదని, జెసి మాటల్లోని ఆవేదనను అర్థం చేసుకోవాలని బొత్స అన్నారు.












Click it and Unblock the Notifications