కత్తితో చంద్రబాబు, మైకు పట్టిన వేణుమాధవ్(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రస్తుతం దేశానికి సమర్థ నాయకత్వం కావాలని, అవినీతి రహిత పాలన కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రావాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టిడిపి అధికారంలోకి చేపట్టాలని ఆయన అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అన్నానగర్ నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్, బోడుప్పల్, ఎల్‌బినగర్ ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోలు, సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు దొంగల పార్టీలని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, అదో కుటుంబ పార్టీ, ఫాంహౌజ్ పార్టీ అని ఆరోపించారు.

పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ని అనాథగా మార్చివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు కంపెనీలు రావడం లేదు. పెట్టుబడులు పెట్టడం లేదని, అనిశ్చిత పరిస్థితి ఉందని, ఎవరంటే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా, సమర్థత తెలుగుదేశం పార్టీకే ఉన్నదన్నారు. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ అభివృద్ధి అంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని, ఇక్కడ ఓటడిగే హక్కు తమకే ఉన్నదని స్పష్టం చేశారు.

నాయకుల అభివాదం

నాయకుల అభివాదం

చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

చంద్రబాబు ప్రసంగం

చంద్రబాబు ప్రసంగం

ప్రస్తుతం దేశానికి సమర్థ నాయకత్వం కావాలని, అవినీతి రహిత పాలన కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

కత్తితో చంద్రబాబు

కత్తితో చంద్రబాబు

అన్నానగర్ నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్, బోడుప్పల్, ఎల్‌బినగర్ ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోలు, సభలో చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

టిడిపి, బిజెపి జెండాలు

టిడిపి, బిజెపి జెండాలు

తెలంగాణ, సీమాంధ్రల్లో టిడిపి, బిజెపి పార్టీల కూటమితో చంద్రబాబు ర్యాలీలో రెండు పార్టీల జెండాలు రెపరెపలాడాయి.

మహిళల ఎదురుచూపులు

మహిళల ఎదురుచూపులు

చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా తమ నేత రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు మహిళలు.

భద్రత పటిష్టం

భద్రత పటిష్టం

చంద్రబాబు నాయుడు రోడ్ షో, బహిరంగ సభల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆయా ప్రాంతాల్లో భద్రతా పటిష్టం చేశారు.

వేణుమాధవ్ ప్రసంగం

వేణుమాధవ్ ప్రసంగం

ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన సినీ నటుడు వేణుమాధవ్ రోడ్ షో‌లో పాల్గొని ప్రసంగించారు.

మాదే విజయం

మాదే విజయం

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రావాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టిడిపి అధికారంలోకి చేపట్టాలని ఆయన అన్నారు.

రోడ్‌షోకు తరలివచ్చిన జనం

రోడ్‌షోకు తరలివచ్చిన జనం

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మారుస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు దొంగల పార్టీలని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, అదో కుటుంబ పార్టీ, ఫాంహౌజ్ పార్టీ అని ఆరోపించారు.

ఆకట్టుకున్న ఎన్టీఆర్ వేషాధారి

ఆకట్టుకున్న ఎన్టీఆర్ వేషాధారి

రోడ్ షో సందర్బంగా అచ్చం దివంగత టిడిపి వ్యస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌లా ఉన్న వ్యక్తి ర్యాలీలో పాల్గొని ప్రజలను ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+