Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం మేం పనిచేస్తాం: తెలుగులో పీఎం మోడీ!!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు సినీ ప్రపంచాన్ని సైతం తన అద్భుత నటన ప్రభావంతో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 101 వ వర్ధంతి నేడు సందర్భంగా తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఎన్టీ రామారావుకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్పందించారు.

దార్శనికత గల నాయకుడు ఎన్టీఆర్: పీఎం మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం అంటూ పేర్కొన్న మోడీ తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు అని కొనియాడారు.

We will work for the society NTR dreamed of PM Modi tweet in telugu

ఎన్టీఆర్ కలలు కన్నా సమాజం కోసం మేం పనిచేస్తాం: మోడీ
సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు . ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.

రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి: టీడీపీ
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేసింది. సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి... రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి... వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు... యుగపురుషుడు అని పేర్కొంది.

పార్లమెంట్ లోనూ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని పేర్కొంది. ఎన్టీఆర్ 101 వ జయంతి సందర్భంగా పార్లమెంటులోనూ ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ నివాళులర్పించారు.

తెలుగువారి ఖ్యాతిని చాటిన మహనీయుడు: పురందేశ్వరి
ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్‌లో తండ్రికి నివాళులు అర్పించారు. 320సినిమాలకు పైగా నటించారని, ఎన్నో పాత్రలలో జీవించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆమె పేర్కొన్నారు . రాజకీయాలు అధికారం కోసమే కాదని, సేవా మర్గంగా భావించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. తెలుగువారికి ప్రత్యేక భాష, ఉనికి, చరిత్ర ఉందని ప్రపంచం గుర్తించడానికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+