రాజధానికి భూములివ్వం: రెండు గ్రామాల్లో ముగ్గులు

గుంటూరు: రాజధానికి భూములు ఇవ్వబోమంటూ సంక్రాంతి ముగ్గుల్లో రాసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతుల బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. మూడు పంటలు పండే భూములను ఇవ్వలేమని గ్రామంలో ఇళ్ల ముందు పలు ముగ్గులు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను భూసమీకఱణ నుండి మినహాయించాలన్నారు.

తెగబడ్డ స్మగ్లర్లు

ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేసి అతనిచ్చిన సమాచారం మేరకు పొదల్లో దాచిన ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు కొడవళ్లతో దాడికి యత్నించిన సంఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువులో జరిగింది.

 We won't give lands for AP capital, villagers says in Sankranti muggu

బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై విలేకరులతో మాట్లాడారు. మధ్యగారిపల్లె వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఎర్రచందనం కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపాడన్నారు.

అతనిచ్చిన సమాచారం మేరకు కట్నగల్లు, పులికల్లు చెట్ల పొదలలో దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు వెళ్లగా అక్కడ మాటువేసిన స్మగ్లర్లు కొడవళ్ళతో పోలీసులపై దాడికి ప్రయత్నించి పరారయ్యారన్నారు. ములకలచెరువు, పిటిఎం మీదుగా కర్నాటకకు రవాణా చేసేందుకు కారుద్వారా తీసుకువచ్చి కట్నగల్లు సమీపంలో దాచినట్లు నిందితుడు చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+