Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో పథకాల అమలు డొల్లే..!-చంద్రబాబుకు షాకింగ్ ఫీడ్ బ్యాక్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తోంది. అయినా కేవలం పెన్షన్లు మినహా మరే ఇతర పథకాలు అమలు కావడం లేదనే అసంతృప్తి లబ్దిదారుల్లో కనిపిస్తోంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని సైతం నిలబెట్టుకోవడం లేదనే ఆగ్రహం నెలకొంది. దీంతో పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్షలో అధికారులకు చంద్రబాబు పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకం, కార్యక్రమంపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
పాలసీలో తప్పులు ఉంటే సరిదిద్దాలని సూచించారు. అమలులో అలసత్వం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలే ఫస్ట్ అనే విధానం కోసం అన్ని వ్యవస్థలు పనిచేయాలన్నారు. పథకాల అమలుపై జిల్లాల వారీగా కూడా రేటింగ్ ఇస్తామన్నారు. ప్రజలు, లబ్దిదారుల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణ చేసి వారానికి నాలుగు శాఖలపై సమీక్ష చేస్తానని చంద్రబాబు తెలిపారు.

welfare schemes implementation and services poor in ap shocking feedback to cm chandrababu

ప్రజలే ఫస్ట్ అనే విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో, అన్ని స్థాయిలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అనేక కష్టాలు, సవాళ్లను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేస్తున్నామని...వీటి ఫలితాలు రావాలంటే వాటి అమలు అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని సిఎం తెలిపారు. మొక్కుబడి పనితీరుతో మార్పు రాదని...గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి పాలనలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా...మార్పు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా అన్ని వ్యవస్థలు పనిచేయాలన్నారు.

శాఖల పనితీరుపై నిరంతరం సర్వేల ద్వారా నివేదికలు తెప్పిస్తామని, ప్రజలిచ్చే రేటింగ్ పై వారానికి నాలుగు విభాగాలపై సమీక్ష చేస్తున్నట్లు సిఎం తెలిపారు. తాజాగా దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసి సర్వీసులు, చెత్త నుంచి కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాలపై ప్రజా స్పందనపై సమీక్ష నిర్వహించారు. ఈ విభాగాల్లో లబ్ధిదారులు, ప్రజల నుంచి ఐవిఆర్ఎస్ ద్వారా, క్యూర్ కోడ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రివ్యూ చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పనితీరుపై పర్సెప్షన్ ట్రాకింగ్ చేస్తున్నామని, ప్రజల నుంచి నేరుగా వస్తున్న ఫీడ్ బ్యాక్ ప్రాతిపదికగా తీసుకుని పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు.

దీపం పథకం ఇలా..

దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడా ఫిర్యాదులు రావడంపై సిఎం అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే, వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని సిఎం సూచించారు. సిలిండర్ల డెలివరీలో ఫిర్యాదులు వస్తే, ఆ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో అకౌంట్ లో డబ్బు జమ పై ప్రజాభిప్రాయం సేకరిస్తే జమ కావడం లేదని కొంత మంది ఫిర్యాదు చేశారని, దీనికి కారణాలు విశ్లేషించి సమస్య పరిష్కరించాలని సిఎం ఆదేశించారు.

ఆర్టీసీ సర్వీసులపై ఇలా

ఆర్టీసీ బస్సు సమయానికి బయలుదేరిందా...నిర్దేశిత సమయానికి గమ్యానికి తీసుకువెళ్లారా, బస్ స్టాండ్ లో సదుపాయాలపై ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ పై చర్చించారు. ఫీడ్ బ్యాక్ కోసం ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలన్నారు. బస్ స్టాండ్ లలో మౌళిక సదుపాయాలపై (తాగునీరు, టాయిలెట్లు, కుర్చీలు) ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక చెప్పగా...దాన్ని సరిదిద్దాలని సిఎం సూచించారు. ఇప్పటికి 1100 బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ పెట్టామని అధికారులు చెప్పగా.. మొత్తం 11 వేల బస్సులతో పాటు బస్ స్టాప్ లు, బస్ స్టేషన్ లలో కూడా క్యూఆర్ కోడ్ ఉంచి...ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. అలాగే బస్ స్టాండ్ లలో ఉండే క్యాంటీన్ లలో ఆహారం, ధరలు వంటి వాటిపైనా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని...తద్వారా నాణ్యమైన సేవలు అందేలా చూడవచ్చని సిఎం అన్నారు.

చెత్త నుంచి కంపోస్ట్ తయారీ, రేషన్ షాపులపై..

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాల పనితీరుపై వచ్చిన ఫీడ్ బ్యాక్ లో ఈ కేంద్రాలు మరింత ఎఫెక్టివ్ గా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. 2014-19 మధ్య కాలంలో చెత్త నుంచి కంపోస్ట్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, మళ్లీ అన్ని కేంద్రాలను వినియోగంలో తేవాలని సిఎం సూచించారు. దీనితో పాటు రేషన్ సరుకుల పంపిణీ పైనా ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమీక్ష చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ధర తీసుకొంటున్నారని, అక్కడక్కడా లబ్దిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులను సిఎం ప్రశ్నించారు. రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఇంటింటికీ సరఫరా పై వస్తున్న ఫిర్యాదులపైనా లోతుగా విచారణ జరపాలన్నారు.

చర్యలు కాదు చర్యలుండాలి..

ప్రతివారం ఓ నాలుగు శాఖల్లో పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని దానిపై సమీక్ష చేస్తానని సిఎం అధికారులకు తెలిపారు. ప్రతిశాఖ గాడిన పడాలని....సేవల్లో మార్పు కనిపించాలని సిఎం అన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పై కేవలం చర్చించడమే కాదని...పొరపాట్లు, తప్పులు జరిగిన చోట సరిదిద్దాలని, అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన చోట చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు ఇస్తామని, వెనకబడిన జిల్లాల కలెక్టర్లు దీనికి అనుగుణంగా పనిచేయాలని సీఎం సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+