Tirumala: తిరుమల లడ్డులో నిజంగానే జంతువు కొవ్వు కలిసిందా.. భక్తులు ఏమంటున్నారంటే..!
వన్ ఇండియా ఎక్స్ క్లూజివ్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని ఆరోపణలు వస్తున్నాయి. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని.. నివేదికలు కూడా ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటే.. లడ్డు కల్తీ కాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై ఇంతకీ భక్తులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. చాలా మంది భక్తులు దేవుడిని రాజకీయాలకు వాడుకొవద్దని కోరుతున్నారు. లడ్డులో జంతువు కొవ్వు కలిపితే మహా పాపమని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు కీడు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంత మంది భక్తులు తిరుమల లడ్డులో రుచి మారిందని చెప్పగా.. మరికొందరు లడ్డు మామూలుగానే ఉన్నట్లు చెప్పారు. లడ్డులో జంతువు కొవ్వు కలిసి ఉండకపోవచ్చని.. ఎందుకంటే.. తయారు చేసేవారికి కూడా దేవుడంటే భయం, భక్తి ఉంటుందిగా అని చెబుతున్నారు. ఈ విషయమై సీబీఐ విచారణ చేయాలని కొందరు కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లడ్డును భక్తలందరూ పవిత్రంగా భావిస్తారని.. తిరుమల వెళ్తున్నామని చెబితే లడ్డు తీసుకురావాలని కోరతారని.. అంతటి మహత్యం ఉన్నా లడ్డును కల్తీ చేస్తే పాపం తగులుతుందని చెబుతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గతంలో తిరుమలలో బాగుండేదని.. కొద్ది సంవత్సరాలు తిరుమలలో పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు పెట్టడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు.
రాజకీయ ప్రజయోనాల కోసం దేవుడిని ఫణంగా పెట్టొద్దని.. ఆరోపణలు నిజమైతే.. బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారిపై భక్తులకు ఉన్న నమ్మకాన్న వమ్ము చేయవద్దని కోరుతున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం ఈ విషయమై సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణ చేసి త్వరలోనే బాధ్యులను గుర్తించనుంది.












Click it and Unblock the Notifications