వైసీతో పొసగదు, పిఆర్పీ అనుభవంతో పవన్ అడుగులు, వారిద్దరూ మిత్రులే: నారాయణ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: చిరంజీవి నిలకడగా ఉంటే రాజకీయాల్లో రాణించేవాడని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అయితే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొనే పార్టీ వ్యవహరాలను నడిపే అవకాశం ఉందన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత మిత్రుత్వం వేరు, రాజకీయ విధానాలు వేరన్నారు. వైసీపీతో తమకు పొసగదని నారాయణ తేల్చి చెప్పారు.

2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనే విషయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అంశాలపై నారాయణ స్పందించారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో నారాయణ పలు విషయాలపై స్పందించారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో సిపిఐ జాతీయ మహసభల్లో తమ విధానాలను స్పస్టం చేయనున్నట్టు చెప్పారు.వామపక్ష లౌకిక శక్తుల మధ్య మరింత ఐక్యతను పెంపొందించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు నారాయణ చెప్పారు.

వైసీపీ పొసగదు

వైసీపీ పొసగదు


వైసీపీతో రాజకీయంగా తమకు పొసగదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయపరంగా ఆ పార్టీతో తమకు విభేధాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ వైసీపీతో కుదిరే పరిస్థితి నెలకొంటే ఇప్పటికే కలిసిపోయేవారమని ఆయన చెప్పారు. రాజకీయంగా ఆ పార్టీతో తమ పార్టీకి విభేధాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరంజీవి అనుభవంతో పవన్ అడుగులు

చిరంజీవి అనుభవంతో పవన్ అడుగులు

ప్రజారాజ్యం పార్టీని చిరంజీని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి అవుతారని భావించి ఉంటారని, కానీ, ఆ సమయంలో వచ్చిన సీట్లతో ఆయన పార్టీని నిలబెడితే రాజకీయాల్లో నిలదొక్కుకొనేవారని నారాయణ అభిప్రాయపడ్డారు. అయితే పిఆర్‌పిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన అనుభవాన్ని దృస్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా అడుగులు వేస్తారని నారాయణ అభిప్రాయపడ్డారు. నిలకడగా రాజకీయాల్లో కొనసాగితేనే నిలదొక్కుకొనే పరిస్థితి పవన్ కళ్యాణ్ కు ఉంటుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్, బాబు మిత్రులే

వైఎస్ఆర్, బాబు మిత్రులే

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మిత్రుడేనని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ తనకు మిత్రుడేనని నారాయణ చెప్పారు. అయితే వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కలిశానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత మిత్రుత్వాలు వేరు. రాజకీయంగా పొత్తులు, ఎత్తులు వేరని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ తనకు మిత్రుడైనంత మాత్రాన వైసీపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదన్నారు. రెండు పార్టీల మధ్య రాజకీయపరమైన ఇబ్బందులున్న సమయంలో పొత్తులు సాధ్యం కాదని ఆయన చెప్పారు.

పవన్ విధానాలను చూడాలి

పవన్ విధానాలను చూడాలి

ప్రస్తుతానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడ బిజెపికి వ్యతిరేకంగా ప్రగతీశీల శక్తులను ఐక్యం చేసేందుకు ప్రయత్నాలను చేస్తున్నామని నారాయణ చెప్పారు.అయితే పవన్ కళ్యాణ్ పార్టీ విధానాలను బహిర్గతం చేసిన తర్వాత ఆ పార్టీ విధానాల ఆధారంగా ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయాన్ని తీసుకొంటామని నారాయణ చెప్పారు. అయితే పవన్ విధానాలను చెప్పకుండానే తాము ఎలా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

చీలిపోయి నస్టపోయాం

చీలిపోయి నస్టపోయాం

కమ్యూనిష్టు పార్టీలు చీలిపోయి తీవ్రంగా నష్టపోయాయని నారాయణ అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల ఎత్తుగడలు వేరు. సిద్దాంతాలు వేరని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలతో పొత్తులను ఏర్పాటు చేసుకొనే విషయమై నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని విధానాల్లో మార్పులు చేసుకోకపోవడం వల్ల నష్టపోయామని ఆయన అంగీకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CPI Leader and National president Narayana has alleged that after BJP has come to the power in the center and in many states, they have managed media to support them. he said that There are differences with ysrcp politics with us

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X