మంజునాథ్ కమిషన్ ఎందుకోసం?:ముద్రగడ

కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏర్పాటుచేసినట్టు చెబుతున్న జసిస్ట్ మంజునాథ్ కమిషన్ పై సీఎం చంద్రబాబునాయుడు వివరణ ఇవ్వాలని కాపు ఉద్యమ నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.

కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏర్పాటుచేసినట్టు చెబుతున్న జసిస్ట్ మంజునాథ్ కమిషన్ పై సీఎం చంద్రబాబునాయుడు వివరణ ఇవ్వాలని కాపు ఉద్యమ నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.

గురువారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాపుల కోసం మంజునాథ్ కమిషన్ ఏర్పాటుచేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, మళ్ళీ ఆయనే బీసీల కోసమే ఈ కమిషన్ అంటూ పత్రికల్లో ప్రకటించారని చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

 What is the purpose of Manjunath commission asks Mudragada

కాపు రిజర్వేషన్ల కోసం మంజునాథ్ కమటీ ఏర్పాటుచేశామని సీఎం ప్రకటించారని, గత ఏడాది ఆగష్టు 16 లోపు కమిషన్ నివేదిక ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారన్నారు. దీనిపై ఇప్పటివరకు ఏ సమాచారం లేదన్నారు. అలాగే తమ కమిషన్ రిజర్వేషన్ అంశంపై కాదని, కేవలం కాపుల స్థితిగతుల నిర్ధారణ కోసమేనని మంజునాథ్ తెలిపారన్నారు.

అటువంటి సమయంలో కాపు జాతి వారిని ఆయన సదస్సులకు ఆహ్వానించడం ఎందుకని ముద్రగడ ప్రశ్నించారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+