వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: బాబుపై రావెలపొగడ్తలు, మందకృష్ణ మీటింగ్ ఉద్దేశ్యమిదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు: మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యవహరశైలి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.మంత్రి పదవి పోయిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు చిక్కులు తెచ్చిపెట్టేలా రావెల కిషోర్‌బాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. రావెల వ్యవహరశైలిపై పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే మందకృష్ణ, రావెల కిషోర్‌బాబులు చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మంత్రి పదవిని కోల్పోవడానికి కూడ వ్యవహరశైలియే కారణమనే ప్రచారం టిడిపి వర్గాల్లో ఉంది. మంత్రిగా ఉన్న కాలంలో రావెల వ్యవహరించిన తీరు పార్టీకి నష్టం కల్గించేదిగా ఉందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. దీంతో మంత్రివర్గం నుండి రావెలను తప్పించారనే ప్రచారం ఉంది.

గుంటూరులో మందకృష్ణ మాదిగ నిర్వహించిన సభలో ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ సభకు అనుమతి తీసుకోలేదు. దీంతో ఈ సభ నిర్వహణను పోలీసులు అడ్డుకొన్నారు. అయితే ఈ సభకు మద్దతుగా ఆనాడు రావెల కిషోర్‌బాబు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే తాజాగా ప్రత్తిపాడులో రావెల కిషోర్‌బాబు మందకృష్ణ మాదిగతో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. రావెల కిషోర్‌బాబు ప్రత్తిపాడులో మందకృష్ణతో సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యమేమిటనే చర్చ సాగుతోంది.

చంద్రబాబుకు చిక్కులు

చంద్రబాబుకు చిక్కులు

మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు తన మంత్రి పదవిని పోగొట్టుకున్న తరువాత వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది.. మంత్రిగా ఉన్నంత కాలం ఎమ్మార్పీఎస్‌కు దూరంగా ఉన్నారు.కొన్ని సమయాల్లో ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేశారనే రావెల కిషోర్‌బాబుపై ఉన్నాయి.మంత్రి పదవి పోయిన తర్వాత రావెలకిషోర్ బాబు ఎమ్మార్పీఎస్ నేతలతో మళ్ళీ సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు.కొన్ని సమయాల్లో పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా రావెల వ్యవహరశైలి ఉంటుందని టిడిపి వర్గాల్లో అభిప్రాయాలున్నాయి. దీంతో రావెలపై పరోక్షంగా టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

మంత్రి పదవి కోల్పోయినందుకే ఇలా

మంత్రి పదవి కోల్పోయినందుకే ఇలా

ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఇటీవల కురుక్షేత్రం పేరుతో మంగళగిరి సమీపంలో మందకృష్ణ మాదిగ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే సభను విజయవంతం చేయాల్సిందిగా వెలిసిన పోస్టర్లలో రావెల ఫోటోలు ఉండటంతో కలకలం రేగింది. రావెల అనుమతితోనే పోస్టర్లు వెలిశాయనే ప్రచారం జరిగినప్పటికీ రావెల మాత్రం ఖండించలేదు. మందకృష్ణ రావెల ఇంట్లోనే ఆ సమయంలో ఉన్నారని ప్రచారం సాగింది. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు రావెలను ప్రశ్నించినట్టు సమాచారం. మంత్రి పదవి నుంచి తప్పించారనే అసంతృప్తితోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లోకి రాగానే మంత్రి పదవి

రాజకీయాల్లోకి రాగానే మంత్రి పదవి


ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రాగానే రావెల కిషో‌ర్‌బాబుకు అదృష్టం తలుపుతట్టింది. ప్రత్తిపాడు నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకొన్నారు.కీలక శాఖలతో కూడిన కేబినెట్‌ పదవి కూడా రావెలకు చంద్రబాబు కట్టబెట్టారు. అయితే అందివచ్చిన అదృష్టాన్ని కూడా అంతే స్పీడుగా ఆయన చేజార్చుకున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

బాబును పొగడడం వెనుక ఉద్దేశ్యమిదే

బాబును పొగడడం వెనుక ఉద్దేశ్యమిదే

గతంలో జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన ఏకంగా మందకృష్ణ మాదిగను తన నియోజకవర్గానికి రప్పించుకున్నారు. తన సామాజికవర్గంలో తానే బలమైన నాయుకుడిని చాటుకు నేందుకు రావెల తపన పడుతున్నారు. మంత్రి పదవి పోతే పోయింది వచ్చే ఎన్నికల్లో తిరిగి సీటైనా దక్కించుకోవాలనే ఆలోచనతో ఆయన వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఆయన ఫొటో కూడా ఉన్న ఫ్లెక్సీలు కూడా నియోజకవర్గంలో వెలిశాయి. సభలో రావెల, కృష్ణ మాదిగ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పొగడ్తలతో ముంచెత్తటం విశేషం.

English summary
What is the reason behind Mandha krishna Madiga sabha in Prattipadu assembly segment on Thursday. Former minister Ravel kishore babu conducted this meeting. Is there any hidden agenda suspect Tdp leaders on this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X