వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు నంద్యాల షాక్: లగడపాటి సర్వేలో వైసిపి గెలుపు, ఆ వ్యూహం పని చేయదా?

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి అఖిలప్రియకు షాక్ తప్పదా? టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతారా?

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి అఖిలప్రియకు షాక్ తప్పదా? టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతారా? అంటే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే అదే చెబుతోందంటున్నారు.

చదవండి: ఇంకా విభేదాలే.. అధిష్టానంపై అఖిలప్రియ అలక: వద్దన్నా వినకుండా అలా?

నంద్యాల ఉప ఎన్నికలపై టిడిపి, వైసిపిలు వ్యూహాలు రచిస్తున్నాయి. టిడిపి ఓ వైపు ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు పోటీ చేసినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. వైసిపి కూడా గెలుపుపై ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో లగడపాటి సర్వే చేశారని తెలుస్తోంది.

చదవండి: కొత్త ట్విస్ట్: అఖిలప్రియ వారిని నమ్మడం లేదా, శిల్పాకు చిక్కులు?

లగడపాటి సర్వేలో..

లగడపాటి సర్వేలో..

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆయా పార్టీలు, అభ్యర్థుల గెలుపుపై సర్వేలు చేస్తుంటారు. గతంలో ఏపీలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుందని, టిడిపి గెలుస్తుందని, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని తమ సర్వేలో తేలిందని లగడపాటి చెప్పారు. అవి నిజమయ్యాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల పైనా ఆయన తన అంచనాలు చెప్పారు. ఇప్పుడు టిడిపి, వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నంద్యాలలోను ఆయన సర్వే చేశారని తెలుస్తోంది.

సర్వేలో వైసిపి విజయం ఖాయమని తేలిందా?

సర్వేలో వైసిపి విజయం ఖాయమని తేలిందా?

లగడపాటి చేసిన సర్వేలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేలిందని ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో పంచుకున్నారని అంటున్నారు.

నాలుగు రోజుల పాటు...

నాలుగు రోజుల పాటు...

లగడపాటి నాలుగు రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో సర్వే చేయించారని ప్రచారం సాగుతోంది. ఈ సర్వేలో వైసిపి గెలుపు ఖాయమని, టిడిపికి ఎదురు దెబ్బ ఖాయమని తేలిందని అంటున్నారు. కాగా, లగడపాటి సర్వే విషయం తెలిసిన స్థానిక టిడిపి నేతలు ఆందోళనలో ఉన్నారని కూడా చెబుతున్నారు.

అందుకే ఏకగ్రీవం అంటున్నారా?

అందుకే ఏకగ్రీవం అంటున్నారా?

భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని టిడిపి మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. జగన్ కూడా మొదటి నుంచి తాము పోటీ చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. అయినా టిడిపి మాత్రం ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి.. ఆ తర్వాత వైసిపి కూడా అభ్యర్థులను ప్రకటించాయి. జగన్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత... ప్రచారంపై దృష్టి సారించిన ఈ సమయంలోను టిడిపి నేతలు ఏకగ్రీవం కోసం జగన్ ఆలోచించాలని చెప్పడం గమనార్హం. ఓటమి భయంతోనే వారు ఏకగ్రీవం అంటున్నారని వైసిపి విమర్శిస్తోంది.

ఆ సెంటిమెంట్ పని చేయదా?

ఆ సెంటిమెంట్ పని చేయదా?

ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేసినా, ఇంకెవరు పోటీ చేసినా సానుభూతి ఓట్లు పడతాయి. ఆ సానుభూతి ఓట్లతోనే గెలుస్తామనే ధైర్యం దాదాపు అందరిలో ఉంటుంది. పైగా ఇక్కడ, భూమా నాగిరెడ్డి జిల్లాల్లో ముఖ్య నేత. కాబట్టి ఆయనకు ఉన్న కేడర్, టిడిపి కేడర్‌కు తోడు సానుభూతి గెలిపిస్తుందని టిడిపి భావిస్తోంది. కానీ లగడపాటి సర్వే మాత్రం మరోలా ఉందని అంటున్నారు. శిల్పా గెలుస్తారంటే.. సెంటిమెంట్ పని చేయడం లేదా అనే చర్చ సాగుతోంది.

English summary
What Former MP Lagadapati Rajagopal Survey says in Nandyal by elections?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X