హోదాకు రూ.1 తగ్గదు, మోడీ వస్తున్నారు.. టపాసులు పేల్చండి: షా

మోడీ ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందని తాను ఇక్కడకు వచ్చిన సందర్భంగా కొందరు నేతలు ప్రశ్నించారని, దానికి సమాధానం చెబుతున్నానని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు.

విజయవాడ: మోడీ ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందని తాను ఇక్కడకు వచ్చిన సందర్భంగా కొందరు నేతలు ప్రశ్నించారని, దానికి సమాధానం చెబుతున్నానని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఏమేమీ ఇచ్చిందో చెప్పారు.

చివరకు పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కూడా తాము తీసుకున్నామన్నారు. ఏపీకి ఏం ఇచ్చామో తనను అడిగిన వారు చెవులు రిక్కరించి వినాలన్నారు. 30వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి సహకరిస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఇచ్చామన్నారు. పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే భరిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలన్నారు. మూడేళ్లలో ఏ ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి చేయని సాయం చేశామన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

హోదాకు ఒక్క రూపాయి తగ్గకుండా ప్యాకేజీ

హోదాకు ఒక్క రూపాయి తగ్గకుండా ప్యాకేజీ

ప్రత్యేక హోదా గురించి కొందరు అడుగుతున్నారని అమిత్ షా అన్నారు. కానీ విభజన బిల్లులో ప్రత్యేక హోదా గురించి నాటి యూపిఏ సమగ్రంగా పెట్టలేదన్నారు. అందుకే హోదా ఇవ్వడం ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయపడ్డారు.

రూ.1.75 వేల కోట్లు ఇచ్చాం

రూ.1.75 వేల కోట్లు ఇచ్చాం

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. హోదాకు సమానంగా, ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ప్యాకేజీ, ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. రూ.1.75 వేల కోట్ల రూపాయలను వివిధ రకాలుగా ఇచ్చామని, మరింత సాయం చేస్తామన్నారు.

మోడీ వస్తారు.. ఏపీలో పండుగ కనిపించాలి

మోడీ వస్తారు.. ఏపీలో పండుగ కనిపించాలి

జూలై నెలలో ప్రధాని మోడీ ఏపీకి వస్తారని, అప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఏపీ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఏపీకి ఎంతో చేసిన మోడీకి థ్యాంక్స్ చెప్పాలన్నారు. జూలైలో మోడీ వస్తారని, అప్పుడు ప్రతి కార్యకర్త వారి ఇళ్లలో వెలుతురును నింపాలన్నారు. మోడీ వచ్చినప్పుడు ఏపీలో ప్రతి కార్యకర్త రంగుల ముగ్గులు వేయాలని, టపాకాయలు పేల్చాలని, పండుగ వాతావరణం నింపాలన్నారు.

టిడిపితో పొత్తు.. మన మంత్రులు ఇద్దరు

టిడిపితో పొత్తు.. మన మంత్రులు ఇద్దరు

మనం ఇక్కడ టిడిపితో పొత్తుతో ఉన్నామని, ఇద్దరు మన బిజెపి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారని అమిత్ షా చెప్పారు. అందులో మన ఆరోగ్య మంత్రికి జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసలు వచ్చాయని చెప్పారు. ఏపీలో 25 బూత్ కమిటీలు నియమించుకోవడం సంతోషకరమన్నారు. 12 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు.

విజయవాడ అంటే గెలుపు నిలయం

విజయవాడ అంటే గెలుపు నిలయం

విజయ అంటే వాడ అంటే నిలయం అని అర్థమని, కాబట్టి విజయవాడ నుంచే బిజెపి విజయయాత్ర ప్రారంభమవుతోందన్నారు. కార్యకర్తల కృషి ఫలితంగా 1300కు పైగా ఎమ్మెల్యేలు మన పార్టీకి ఉన్నారని చెప్పారు. ఈ సభ బిజెపికి పాశుపతాస్త్రం అన్నారు.

ఇంద్రకీలాద్రిని చీల్చి కృష్ణుడు అర్జునుడికి దారి చూపించాడని, అలాగే ఇక్కడి కార్యకర్తలు కూడా బిజెపి గెలుపుకు కృషి చేస్తారని భావిస్తున్నానని చెప్పారు. మోడీ సర్కార్ వచ్చాక పేదల కోసం 106 పథకాలను తీసుకు వచ్చిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+